సినీ రంగంలో ఎవరికి ఎప్పుడు, ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకోని మలుపులు, ఊహించని సంఘటనలే ఒక నటీనటుడి కెరీర్‌ను మలుపు తిప్పుతాయి. తాజాగా డైరెక్టర్ రవిబాబు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలలో, మనసారా హీరోయిన్ శ్రీదివ్య ఎంపిక వెనుక జరిగిన ఆశ్చర్యకరమైన ఘటన గురించి వివరించారు. అప్పట్లో శ్రీదివ్య తమిళంలో పెద్ద స్టార్ అన్న విషయం తనకు తెలియదని, ఆమె టీవీ సీరియల్స్‌లోంచి వచ్చిందని భావించానని ఆయన తెలిపారు. ఒక సినిమా కోసం హీరోయిన్ పాత్రకు అన్వేషిస్తుండగా, తన అసిస్టెంట్ కెమెరామెన్ ఒక అమ్మాయిని స్ర్కీన్‌టెస్ట్‌కు పిలవమని సూచించారని చెప్పారు. స్ర్కీన్‌టెస్ట్ జరుగుతున్న సమయంలో తాను గది నుంచి బయటకు వచ్చానని.. ఆ సమయంలో ఒక అమ్మాయి స్తంభానికి ఆనుకుని నిలబడి, నావైపు చూస్తుంది. “ఎవరు ఈ అమ్మాయి?” అని అడిగితే, “లోపల ఉన్న అమ్మాయి సోదరి” అని సమాధానం వచ్చింది. వెంటనే లోపల ఉన్న అమ్మాయి స్ర్కీన్‌టెస్ట్‌ను ఆపి, బయట ఉన్న అమ్మాయికి టెస్ట్ చేయమని చెప్పాను.
ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..
వెంటనే ఆ అమ్మాయికి కేరళ గెటప్ వేసి స్టిల్స్ తీయించాను. ఆ స్టిల్స్ చూసి ఆమెనే ఫైనల్ చేశాను. తనే శ్రీదివ్య అని దర్శకుడు ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అది శ్రీదివ్య సినీ ప్రయాణంలో ఒక కీలక మలుపు అని ఆయన అన్నారు. ఆ సినిమా తర్వాత శ్రీదేవితో ఎప్పుడూ పెద్దగా కలవలేదని, ఒకసారి డబ్బింగ్ థియేటర్‌లో తారసపడ్డారని తెలిపారు. “ఇలాంటివి ఉండవు. నేను కూడా అంతే. నేను కూడా వాళ్లతో టచ్‌లో ఉండాలనే యాటిట్యూడ్ నాకు కూడా ఉండాలి. కానీ నేను కూడా ఎందుకో ఉండలేదు” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..
“మనం ఎవరికీ ఏ ఫేవర్ చేయట్లేదు. మన అవసరం తీర్చుకుంటున్నాం. మన అవసరం గురించి అవతలోడిని వాడుకుంటున్నాం. ఇప్పుడు అది వాళ్లకి బెనిఫిట్ అయింది” అని ఆయన తన ఆలోచనను స్పష్టం చేశారు. “నేను వాళ్లకి ఏదో ఛాన్స్ ఇచ్చాను, వాళ్లకి ఏదో లైఫ్ ఇచ్చాను ఇది కాదు. దట్ ఈజ్ దేర్ డెస్టినీ. వాళ్ల డెస్టినీలో వాళ్లకి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. అంతేగానీ ఎవడూ ఎవరికీ లైఫ్ ఇవ్వటం ఇవన్నీ ఉండవు” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
శ్రీదివ్య..
ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..