Headlines

సరిహద్దుల్లోనే కాదు.. ఆపదలోనూ తోడుగా ఉంటామని నిరూపించిన భారత సైనికులు!


సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం నిలబడే సైనికుల మధ్య ఉండే బంధం రక్తసంబంధం కంటే గొప్పది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, సైనికుల కుటుంబాలను తమ సొంత కుటుంబాలుగా భావిస్తారు. తాజాగా భారత సైన్యంలోని 16 జాట్ రెజిమెంట్ అధికారులు, జవాన్లు చేసిన ఇక గొప్ప పని అందరి హృదయాల్ని కదిలిస్తోంది. దివంగత సహచర సైనికుడి కుమార్తె వివాహ వేడుకలో కుటుంబ సభ్యులుగా నిలిచి, ఆర్థిక సహాయంతో పాటు ఆత్మీయతను పంచారు.

అసలేం జరిగింది?

భారత సైన్యంలోని 16 జాట్ రెజిమెంట్‌లో సేవలందించిన హవల్దార్ పప్పల్ సింగ్ మరణించిన తర్వాత, ఆయన కుటుంబం కీలక ఘట్టాలను ఆయన లేకుండానే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా హర్సోలి గ్రామంలో నవంబర్ 21న ఆయన కుమార్తె ప్రీతి వివాహం జరిగింది. ఈ శుభకార్యంలో ప్రీతికి, ఆమె కుటుంబానికి తోడుగా నిలవాలని పప్పల్ సింగ్ సహచర సైనికులు నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి



కుటుంబ సభ్యులుగా బాధ్యతలు, ఆర్థిక సహాయం:

వివాహ వేడుకకు రెజిమెంట్ అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, జవాన్లు యూనిఫామ్‌లో హాజరయ్యారు. సాధారణంగా తండ్రి లేదా సోదరులు నిర్వహించే సంప్రదాయ వేడుకల్లో జవాన్లు దగ్గరుండి తోడుగా నిలిచారు. పెళ్లి ఖర్చుల నిమిత్తం రెజిమెంట్ సిబ్బంది కలిసి రూ.1.61 లక్షలను కుటుంబానికి అందజేశారు. అలాగే, ప్రీతి తల్లి అనితా దేవిని శాలువాతో సత్కరించి తమ గౌరవాన్ని, ఆత్మీయతను చాటుకున్నారు.

ప్రశంసల వర్షం:

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోబడుతున్నాయి. సేవా పరమో ధర్మ అనే స్ఫూర్తితో సైనికులు చూపిన ఈ ఐక్యత, బాధ్యతపై నెటిజన్లు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సైనికుల సోదరభావం విధులకే పరిమితం కాదని, తోటి జవాన్ల కుటుంబాల జీవితాల్లోని ముఖ్యమైన మైలురాళ్ల వద్ద కూడా అండగా నిలుస్తుందని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *