Headlines

Nagarjuna : ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు.. ఆయన కొడుకు ఇప్పుడు తోపు హీరో..


తెలుగు సినీ ప్రపంచంలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అడుగుపెట్టి తనదైన ముద్ర వేసుకున్నారు నాగార్జున. ఇప్పటికీ ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని, నందమూరి కుటుంబాల మధ్య తరతరాలుగా ఆత్మీయ బంధం కొనసాగుతోంది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోని చాలా మంది సహనటులు, దర్శకులు, సీనియర్లతో ఎంతో స్నేహంగా, గౌరవంగా ఉంటారు. అయితే ఇండస్ట్రీలో నాగార్జున ఆప్యాయంగా, హక్కుగా ‘అన్నయ్య’ అని పిలిచే ఏకైక నటుడు దివంగత నందమూరి హరికృష్ణ మాత్రమే. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం, కలిసి నటించిన జ్ఞాపకాలు ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఆ బంధం ఏర్పడటానికి కారణం ఓ సినిమా.

ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..

1999లో వచ్చిన ‘సీతారామరాజు’ చిత్రంలో నాగార్జున, హరికృష్ణ అన్నదమ్ములుగా కనిపించారు. ఇందులో నాగార్జున తమ్ముడిగా కనిపించగా , హరికృష్ణ అన్నయ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాకు మంచి అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి హరికృష్ణను నాగార్జున హరి అన్న అని పిలుస్తుంటారు. హరికృష్ణ మరణం తనను ఎంతో బాధపెట్టిందని.. ఆ బాధను తాను మాటల్లో చెప్పలేనని గతంలో చెప్పుకొచ్చారు నాగార్జున.

ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..

నందమూరి తారక రామారావు తనయుడిగా, బాలనటుడి నుంచి నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరికృష్ణ. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ వంటి చిత్రాల్లోనూ హరికృష్ణ తనదైన నటనతో మెప్పించి నంది అవార్డులు అందుకున్నారు. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో, తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *