Headlines

Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. తెలుగురాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!


Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. తెలుగురాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు గాలులలోని ద్రోణి ప్రస్తుతం మన్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు తీరానికి ఆవల ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు, కొమోరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు అంతర్భాగం మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న తూర్పు గాలుల ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణం ఈ కింది విధంగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:

ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ., గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.

రాయలసీమ:

రాయలసీమలోనూ రాబోయే మూడు రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. అలాగే బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ., గరిష్ఠంగా 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

తెలంగాణలో వాతావరణం ఇలా:

ఈ ద్రోణి ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *