Headlines

IPL 2027: 66 స్థానాలకు 1,220 మంది పోటీ.. ఐపీఎల్ వేలంలో దేశాల వారీగా ఆటగాళ్ల లెక్కలివే


IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఈసారి వేలంలో పాల్గొనేందుకు ఏకంగా 1,220 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు 17 దేశాలకు చెందిన విదేశీ క్రికెటర్లు కూడా పోటీకి సిద్ధమయ్యారు. బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 939 మంది భారత ఆటగాళ్లు, 281 మంది విదేశీ ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే వీరిలో అందరికీ వేలంలో పాల్గొనే అవకాశం ఉండదు. ఫ్రాంచైజీలు ఎంపిక చేసిన తర్వాత తుది ఆటగాళ్ల జాబితా విడుదల కానుంది.

ఏకంగా 1,220 మంది ఆటగాళ్లు

బీసీసీఐ ఈసారి ఆటగాళ్లను ఆరు విభాగాలుగా వర్గీకరించింది. ఇందులో 14 మంది క్యాప్డ్ భారత ఆటగాళ్లు, 170 మంది క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో ఆడిన 127 మంది అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు కూడా వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరితో పాటు 798 మంది ఇతర అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు, 69 మంది అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి మరో 42 మంది క్రికెటర్లు పోటీకి సిద్ధమయ్యారు. అంటే మొత్తం 184 మంది క్యాప్డ్ ఆటగాళ్లు, 994 మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి



ఏ దేశం నుంచి ఎంతమంది?

విదేశీ ఆటగాళ్ల రిజిస్ట్రేషన్లలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం నుంచి అత్యధికంగా 53 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. సౌతాఫ్రికా నుంచి 40 మంది, వెస్టిండీస్ నుంచి 36 మంది, న్యూజిలాండ్ నుంచి 25 మంది, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 23 మంది ఉన్నారు. శ్రీలంక నుంచి 21 మంది, ఇంగ్లండ్ నుంచి 16 మంది, అమెరికా నుంచి 13 మంది, బంగ్లాదేశ్ నుంచి 12 మంది పేర్లు ఇచ్చారు. యూఏఈ, నేపాల్ నుంచి చెరో 10 మంది, ఐర్లాండ్ నుంచి ఏడుగురు, జింబాబ్వే నుంచి ఆరుగురు రిజిస్టర్ చేసుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, కెనడా, జపాన్, స్కాట్లాండ్ నుంచి చెరో ఇద్దరు ఆటగాళ్లు వేలం జాబితాలో చోటు కోసం పేర్లు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: IPL Auction 2027: బెన్ స్టోక్స్ నుంచి డేవిడ్ వార్నర్ వరకు.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలో 29 మంది ప్లేయర్లు

1,220 మందిలో 66 మందికే అవకాశం

మరోవైపు పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే 184 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. వీరిలో 55 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో మొత్తం జట్లలో ఇంకా 66 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వాటిలో 25 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే 1,220 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, తుది జట్లలో చోటు దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఏ ఆటగాళ్లు తమ జట్టుకు ఉపయోగపడతారో ఫ్రాంచైజీలు అంచనా వేసి తుది వేలం జాబితా కోసం పేర్లు సూచించనున్నాయి.

డిసెంబర్ 4న తుది జాబితా

ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ జాబితా విడుదలైనంత మాత్రాన ఇదే తుది వేలం జాబితా కాదు. ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల పేర్లను బీసీసీఐకి సూచించాలి. అదనంగా కొందరు ఆటగాళ్ల పేర్లను చేర్చాలని కోరేందుకు కూడా జట్లకు అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిసెంబర్ 4, 2026న ఆటగాళ్ల పేర్లు, వారి బేస్ ప్రైస్‌తో కూడిన తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఇక ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఏ ఆటగాడికి ఎంత ధర పలుకుతుంది? ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *