Headlines

విశాఖ సత్యం జంక్షన్‌లో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం


విశాఖ సత్యం జంక్షన్‌లో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం

వైజాగ్ నగరంలో అర్ధరాత్రి వేళ ఓ ఆర్టీసీ బస్సు పెను ప్రమాదానికి కారణమైంది. సత్యం జంక్షన్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజోలు నుంచి విశాఖపట్నం వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు నియంత్రణ కోల్పోయి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత సమీపంలోని ఓ చెట్టును బలంగా ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. బస్సు ఢీకొనడంతో పలు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ దుర్ఘటనపై హోం మంత్రి అనిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సత్యం జంక్షన్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *