Headlines

నెలకు రూ.5 వేలు నేరుగా మీ ఖాతాలోకే.. కేంద్రం అదిరిపోయే పథకం.. దరఖాస్తు చేస్కోండి..


కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఒక అద్బుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. ఏకంగా నెలకు రూ.5 వేల వరకు మీరు పెన్షన్ పొందవచ్చు. సామాన్యులు ఎవరైనా అ స్కీములో చేరే అవకాశముంది. అదే అటల్ పెన్షన్ యోజన (APY) పథకం. ఈ పథకం ఎప్పటినుంచోె అమలవుతోంది.ొ ఈ స్కీములో మీరు అతి తక్కువ జమ చేయడం ద్వారా జీవితకాలం పెన్షన్ పొందవచ్చు. వృద్దాప్యంలో ఆర్ధిక సమస్యలు లేకుండా జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది. రోజువారీ చిన్న పొదుపుతో జీవితకాలం ఆదాయాన్ని పొందవచ్చు. చాలా సులభంగా ఈ పథకంలో చేరవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో చేరడం వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక ఒత్తిడి ఉండదు. డబ్బు కోసం మీ కుటుంబంపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు.

అర్హతలు ఏంటంటే..

అటల్ పెన్షన్ యోజన పథకం దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఏప్రిల్ 21, 2026 నాటికి 9 కోట్లకు పైగా ప్రజలు ఇందులో చేరారు. మీ వయస్సు 40 సంవత్సరాల లోపు ఉంటే APY పథకంలో చేరవచ్చు. 40 ఏళ్ల వయస్సు దాటితే ఇందులో చేరేందుకు అనర్హులు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటే ఈ పథకంలో చేరేందుకు అనర్హులు. మీరు ఇందులో ప్రతీ నెలా కొంతమొత్తం చందా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత మీకు ప్రతీ నెల పెన్షన్ రూపంలో అందుతుంది. మీరు మరణిస్తే జీవిత భాగస్వామి, నామినీకి అందిస్తారు. మీరు రూ.వెయ్యి నుండి రూ. 5 వేల వరకు పొందవచ్చు.

ప్రతీ నెలా రూ.5 వేలు అకౌంట్లోకి..

ఖాతాదారుడు,జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే నామినీకి మొత్తం ఒకేసారి అందిస్తారు. మీరు 18 ఏళ్ల వయస్సులో ఈ పెన్షన్ పథకంలో చేరితే నెలకు కేవలం రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత రూ.5 వేలు పెన్షన్ లభిస్తుంది. మీకు 60 ఏళ్లు రాగానే అందడం ప్రారంభమవుతుంది. అటల్ పెన్షన్ యోజనలో చేరడం ద్వారా, భార్యాభర్తలు ఇద్దరూ నెలకు రూ. 10 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి కొనసాగించాలి. ఖాతాదారులు కొన్ని పరిస్థితులలో 60 ఏళ్ల వయస్సు రాకముందే నిధులను ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇలా ఈ స్కీములో అనేక బెనిఫిట్స్ పొందే అవకాశముంది. పదవీ విరమణ తర్వాత వృద్దాప్యంలో ప్రతీ నెలా ఒక ఫిక్స్‌డ్ ఇన్కమ్, ఆర్ధిక భద్రత కాావాలని కోరుకునేవారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *