Headlines

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?


ససముద్రంలో శత్రువుల కదలికలకు చెక్ పెట్టడానికి భారత నౌకాదళం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 12 AI-ఆధారిత డ్రోన్ బోట్‌లు మాతంగి పేరుతో భారత నావికాదళంలో చేరాయి. మనుషులు లేకుండానే సముద్రాన్ని శాసించే ఈ సైలెంట్ వారియర్స్, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.సాధారణ గస్తీ నౌకలకు భిన్నంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడిన ఈ మానవరహిత సాయుధ నౌకలు, కేవలం నిఘా కోసమే కాకుండా శత్రువులపై దూకుడుగా దాడి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఇందులో 12.7mm రిమోట్ కంట్రోల్డ్ గన్ అమర్చబడింది. ముంబై నుంచి టూటికోరిన్ వరకు 1500 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని నాన్-స్టాప్‌గా ప్రయాణించగల సత్తా వీటికి ఉంది. భారీ అలల తాకిడికి గురైనా, దానంతట అదే తిరిగి నిలబడే స్వీయ-రక్షణ సామర్థ్యం వీటి ప్రత్యేకత.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *