Headlines

కొత్త ఇన్ ఛార్జ్ రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్!


కొత్త AICC ఇంచార్జ్ సందీప్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటివరకు నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేతల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. తన పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి పరిస్థితులను వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ 3% ఓటు బ్యాంకు నుంచి 64 సీట్లకు ఎదిగిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 స్థానాలు, కోటి ఓట్లే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూ నష్టం చేకూర్చే నేతలకు ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తన మాట విన్నవారు మంచి స్థానంలో ఉన్నారని, వినని వారు ఇబ్బంది పడ్డారని గుర్తు చేస్తూ క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. ఇంచార్జ్ సందీప్ తన రెండు రోజుల పర్యటనలో నేతలతో సమావేశమై, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని సీఎం తేల్చి చెప్పారు. పార్టీని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్, ఇంచార్జ్ సందీప్ కలిసికట్టుగా పని చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *