Headlines

Google Layoffs: 24 గంటల్లో రాజీనామా చేయాలంటూ ప్రచారం.. అసలు నిజమేంటో చెప్పిన గూగుల్!


Google India Layoffs: భారత్‌లో గూగుల్ ఉద్యోగుల తొలగింపులపై కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు సంస్థ తెరదించింది. పెద్దఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అయితే, గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో ఇటీవల కొన్ని ఉద్యోగ బాధ్యతలను తొలగించినట్లు అంగీకరించింది.

సంస్థలో పనుల నిర్వహణ, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు గూగుల్ వెల్లడించింది. ఈ ప్రక్రియలో సుమారు 30 పోస్టులు రద్దయ్యాయని తెలిపింది. అయితే, ఈ నిర్ణయం కారణంగా ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు? ఏ విభాగాల్లో ఈ మార్పులు జరిగాయి? అనే వివరాలను వెల్లడించలేదు.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా గూగుల్ లేఆఫ్‌లపై ఓ పోస్ట్ వైరల్ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఉద్యోగులు 24 గంటల్లో రాజీనామా చేయాలని, లేదంటే కంపెనీ నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరిస్తోందంటూ ప్రచారం జరిగింది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరిలో మరో విడత ఉద్యోగ కోతలు ఉండొచ్చని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈ ప్రచారంపై గూగుల్ క్లౌడ్ ఇండియా అధికారిక ఖాతా స్పందించింది. భారత్‌లో భారీ స్థాయిలో లేఆఫ్‌లు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. పని ప్రణాళికల్లో మార్పులకు అనుగుణంగా పరిమిత స్థాయిలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ మాత్రమే చేపట్టినట్లు పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *