Headlines

అబ్బో మేడమ్ సర్.. ఆరు తరాలకు సరిపడ ఆస్తులు సంపాదించిన హీరోయిన్.. 53 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..


సినీ రంగంలో కొందరు నటీనటుల ప్రస్థానం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలనుకున్న ఒక అమ్మాయి, అనూహ్యంగా బుల్లితెరలోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆ ప్రముఖ నటి మరెవరో కాదు.. సాక్షి తన్వర్. తన ప్రతిభ, క్రమశిక్షణ, ఆర్థిక అవగాహనతో ఆమె ఎదిగిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజస్థాన్‌లో జన్మించిన సాక్షి తన్వర్ తండ్రి రిటైర్డ్ సీబీఐ అధికారి. చదువులో చురుగ్గా ఉన్న సాక్షి, తన తండ్రి ఆశయం మేరకు ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంటూ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యారు. అయితే 1998లో ఒక స్నేహితుడి సూచన మేరకు దూరదర్శన్ కార్యక్రమం కోసం ఆడిషన్ ఇవ్వడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తొలుత టీవీ ప్రెజెంటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత నటన రంగంలోకి ప్రవేశించి వెనుదిరిగి చూడలేదు.

ఏక్తా కపూర్ నిర్మించిన ‘కహానీ ఘర్ ఘర్ కీ’ సీరియల్‌లో పార్వతి అగర్వాల్ పాత్రతో సాక్షి తన్వర్ ఇంటింటికీ చేరువయ్యారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ ధారావాహిక ఆమెకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘బడే అచ్ఛే లగ్తే హై’ వంటి హిట్ షోలతోనూ ప్రేక్షకులను అలరించారు. బుల్లితెరపైనే కాకుండా, అమీర్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దంగల్’ తో పాటు పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతోనూ తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు.

విజయాలు సాధించినప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ హడావుడికి దూరంగా, నిరాడంబరంగా ఉంచుకుంటారు సాక్షి తన్వర్. వివాహం చేసుకోని ఆమె, 2018లో ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని సింగిల్ మదర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వృథా ఖర్చులకు దూరంగా ఉంటూ, పొదుపు, పెట్టుబడులపై శ్రద్ధ పెట్టడం వల్ల నేడు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆమె సంపాదన పట్ల సహనటులు సైతం ప్రశంసలు కురిపించడం ఆమె ప్రస్థానంలోని మరో విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *