రాగులలోని పోషక విలువలు 100 గ్రాముల రాగులలో 344 మిల్లీగ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీలు, 3.6 గ్రాముల పీచుపదార్థం, సుమారు 7.3 గ్రాముల ప్రొటీన్, 1.3 గ్రాముల కొవ్వు ఉంటాయి. రాగులలో క్యాల్షియం అధికంగా ఉండటం ప్రధాన విశేషం. చిక్కటి ఆవుపాలతో పోలిస్తే రాగులలో దాదాపు మూడు రెట్లు ఎక్కువ క్యాల్షియం ఉంటుంది .ఈ అధిక క్యాల్షియం కారణంగానే పూర్వం వృద్ధులకు, ఎముకలు బలహీనమైన వారికి, నీరసంగా ఉన్నవారికి, మంచం మీద ఉన్నవారికి బలాన్ని, క్యాల్షియంను అందించడానికి రాగి జావను ఇచ్చేవారని చెబుతున్నారు.