Headlines

Telangana: యువరైతు ప్రాణం తీసిన కరెంట్ తీగ.. పశువులు మేపేందుకు వెళ్లి..


Telangana: యువరైతు ప్రాణం తీసిన కరెంట్ తీగ.. పశువులు మేపేందుకు వెళ్లి..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువ రైతు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన మాచర్ల నర్సింలు అనే రైతు.. తన నారుమడి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. అయితే అదే గ్రామానికి చెందిన రేపాక రమేష్ అనే యువకుడు ఆ ప్రాంతంలో పశువులను మేపుతూ పొరపాటున ఆ విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.

ప్రమాద సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పశువులను మేపేందుకు వెళ్లిన కుమారుడు ఎంత సమయమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. రమేష్ మృతి చెందిన విషయం తెలిసింది. పొలంలో విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన నర్సింలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *