అయితే, కొన్నిసార్లు ఇంట్లోని తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. సరైన నీరు, సూర్యరశ్మి అందించినప్పటికీ మొక్క ఎండిపోతే చాలామంది ఆందోళన చెందుతుంటారు. వాస్తు నమ్మకాల ప్రకారం, తులసి మొక్క ఎండిపోవడాన్ని కొందరు రాబోయే ఆపదకు సంకేతంగా కాకుండా, ఇంటిపైకి రాబోయే పెద్ద సంక్షోభాన్ని తులసి తనపైకి తీసుకుందని భావిస్తారు. అయితే మొక్క ఎండిపోవడానికి నీటి కొరత, అధిక వేడి, తెగుళ్లు వంటి సహజ కారణాలు కూడా ఉండవచ్చు.