Headlines

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 5న JNTUలో మెగా జాబ్‌ మేళ.. అర్హులు వీరే


నిరుద్యోగ యువతకు, కొత్తగా పట్టభద్రులైన విద్యార్థులకు ఇదో అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TTPOA), జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -JNTUH సంయుక్త ఆధ్వర్యంలో ‘మెగా జాబ్ మేళా 2026’ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను JNTUH వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ క్రిషన్ కుమార్ రెడ్డి క్యాంపస్‌లో ఆవిష్కరించారు. ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లకు ప్రముఖ కంపెనీలలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా డ్రైవ్‌ను చేపడుతున్నారు.

ఈ మెగా జాబ్ మేళా 2026 డిసెంబర్ 5వ తేదీన హైదరాబాద్‌లోని JNTUH క్యాంపస్‌లో జరగనుంది. 2020 నుండి 2026 మధ్య కాలంలో B.Tech, MBA, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చని నిర్వాహకులు ప్రకటించారు. వివిధ రంగాలలో కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి ఇది ఫ్రెషర్స్‌తో పాటు అర్హులైన అభ్యర్థులకు ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పరిశ్రమలకు, విద్యాసంస్థలకు మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా యజమానులు, రిక్రూటర్లు, ఉద్యోగార్థులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల నియామక ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఉపాధి సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి కెరీర్ అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో JNTUH ఎల్లప్పుడూ ముందుంటుందని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ భారీ ఉపాధి కల్పన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న వైస్-ఛాన్సలర్‌కు, విశ్వవిద్యాలయ అధికారులకు, భాగస్వాములందరికీ TTPOA అధ్యక్షుడు డాక్టర్ జయరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లందరూ ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని, డిసెంబర్ 5న JNTUH క్యాంపస్‌లో జరిగే ‘మెగా జాబ్ మేళా 2026’లో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *