Headlines

Priyansh Arya: టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. బౌండరీలతోనే 150 పరుగులు బాదిన ఢిల్లీ కెప్టెన్!


సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య రికార్డుల మోత మోగిస్తున్నాడు. మంగళవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో ప్రియాన్ష్ ఆర్య విరుచుకుపడ్డాడు. కేవలం 97 బంతుల్లో 181 పరుగులు చేసి భారత క్రికెటర్లలో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. మరీ ముఖ్యంగా అతను చేసిన 181 పరుగులలో 150 పరుగులు కేవలం బౌండరీలతోనే సాధించాడు. అతని మొత్తం స్కోరులో 19 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ20 ఇన్నింగ్స్‌లో బౌండరీల రూపంలో 150 పరుగులు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.

అయితే మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్‌గా దిగిన ఆర్య ఆరంభం నుంచే తమిళనాడు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్‌ప్లేలోనే ఎనిమిది సిక్సర్లు బాది తమిళనాడు బౌలర్లకు చుక్కలు చూపించాడు. అదే స్పీడ్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తూ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20ల్లో తన మూడో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.

అయితే క్రీజులో ఉన్న సహచర ప్లేయర్స్ వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. ఆర్య మాత్రం దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 59 బంతుల్లో 149 పరుగుల వద్ద ఉన్నప్పుడు వరుసగా రెండు సిక్సర్లు కొట్టి.. 150 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో భారతీయ టీ20 క్రికెట్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

అంతకుముందు ఈ జాబితాలో కేఎల్ రాహుల్, తిలక్ వర్మ ఉండగా తాజాగా ప్రియాన్ష్ చేరాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై రాహుల్ అజేయంగా 152 పరుగులు చేయగా.. 2024 చివర్లో జరిగిన దేశవాళీ పోటీలో మేఘాలయపై తిలక్ వర్మ అజేయంగా 151 పరుగులు సాధించాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో ఆర్య క్రియేట్ చేసిన మరో రికార్డు ఏమిటంటే.. టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా నిలిచాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *