Headlines

Video: జెన్సన్ హువాంగ్ కు ఆఫీసులో స్టాండింగ్ ఒవేషన్


ఆఫీసులో తన మొదటి రోజు కావడంతో జెన్సన్ హువాంగ్ ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. ‘ఈ రోజు నా ఉద్యోగంలో మొదటి రోజు. నా దగ్గర కంప్యూటర్ కూడా లేదు. ఐటీ విభాగం నాకు కొత్త పీసీ ఇవ్వబోతోంది. అది ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ (RTX Spark) అయి ఉంటుందని ఆశిస్తున్నాను’ అంటూ నవ్వులు పూయించారు. ఆయన మాటలకు ఉద్యోగులంతా నవ్వుకున్నారు. తర్వాత జెన్సన్ హువాంగ్ ఒక్కసారిగా తన గొంతు మార్చారు. ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ‘మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులకు గురిచేసినందుకు నిజంగా క్షమించండి. వాటిని సరిదిద్దుకుని తిరిగి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను’ అన్నారు. అక్కడి వాతావరణం ఒక్కసారిగా భావోద్వేగంగా మారింది. ఉద్యోగులు మరోసారి చప్పట్లతో ఆయనకు మద్దతు తెలిపారు.

ఉద్యోగుల నుంచి 1,600కు పైగా కామెంట్లు.. బోర్డు కీలక నిర్ణయం!

జెన్సన్ హువాంగ్ తిరిగి రావాలనే డిమాండ్ ను ఎన్విడియా ఉద్యోగులు బలంగా వినిపించారు. అంతర్గత సూచనల వ్యవస్థకు 1,600కు పైగా కామెంట్లు వచ్చాయి. కంపెనీ షేర్ల ధర పడిపోవడం కూడా బోర్డుపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో నవంబర్ 23న జరిగిన సమావేశాల్లో బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా జెన్సన్ హువాంగ్‌ను తిరిగి అధ్యక్షుడిగా, సీఈఓగా, డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జెన్సన్ హువాంగ్ ఎలాంటి తప్పు చేయలేదని CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జెన్సన్‌ హువాంగ్‌ తిరిగి బాధ్యతలు చేపట్టిన రోజున ఎన్విడియా షేర్లు సుమారు 31 శాతం పెరిగాయి.

Jensen Huang officially returns to Nvidia’s office receives standing ovation

బోర్డు మద్దతుతో జెన్సన్ హువాంగ్ మళ్లీ బాధ్యతలు చేపట్టినప్పటికీ వివాదం ఇంకా ముగియలేదు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతుందని ఎన్విడియా బోర్డు స్పష్టం చేసింది.  జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరగాలని అమెరికా చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు. అమెరికా ప్రతినిధుల సభ కమిటీల నేతలు ఈ వ్యవహారంపై విచారణను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. డిసెంబర్ 1, 2 తేదీల్లో జెన్సన్ హువాంగ్‌తో పాటు ఎన్విడియా జనరల్ కౌన్సెల్ టిమ్ టెటర్ నుంచి అధికారికంగా వివరాలు సేకరించనున్నారు.

ఆలిస్ హువాంగ్ ఎక్కడుంది?

ఆలిస్ హువాంగ్ తిరిగి చైనాకు వెళ్లి రాజధాని బీజింగ్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. చైనా భద్రతా అధికారులకు ఈ విషయం తెలిసే ఆమె అక్కడ ఉంటున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్‌కు వ్యాపార పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. ఆలిస్ హువాంగ్‌కు చైనాకు చెందిన గూఢచార సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు అమెరికా నిఘా సంస్థల్లో మొదలయ్యాయి. చైనాలోని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS) అనే సంస్థకు చెందిన ఓ అధికారితో ఆలిస్ హువాంగ్ 2025లో సంప్రదింపులు జరిపినట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ వ్యవహారం జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు సంబంధం కొనసాగిన సమయంలోనే జరిగింది.

ఈ వ్యవహారంలో ఆలిస్ హువాంగ్ వ్యాపార భాగస్వామి కాంగ్ వీ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆలిస్ అతడిని తన భర్తగా ఇతరులకు పరిచయం చేసేవారని సమాచారం. అతడికి కూడా చైనా గూఢచార సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు ఆధారాలు సేకరించాయి. ఈ నెట్‌వర్క్‌లో మరో కీలక వ్యక్తి లీ మింగ్. 52 ఏళ్ల చైనా జాతీయుడైన ఈయన మెగాస్పీడ్ వ్యాపార కార్యకలాపాల్లో కీలక వ్యక్తి.

అమెరికా ఎగుమతుల నిబంధనల ప్రకారం అత్యాధునిక ఎన్విడియా ఏఐ చిప్‌లను చైనాకు నేరుగా సరఫరా చేయడంపై ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మెగాస్పీడ్ కొనుగోలు చేసిన కొన్ని అత్యాధునిక చిప్‌లు ఆగ్నేయాసియాలోని డేటా సెంటర్లకు చేరినట్లు సమాచారం. ఈ డేటా సెంటర్లు అలీబాబా సహా చైనా టెక్నాలజీ కంపెనీలకు సేవలందిస్తున్నాయి. చైనా సైనిక అవసరాలకు కూడా ఈ చిప్‌లు ఉపయోగపడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *