
దర్శకుడు కృష్ణవంశీ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, చిత్రాల వెనుక ఉన్న తత్వశాస్త్రం గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వరకు, మద్రాస్ మీదుగా సాగిన తన ప్రయాణాన్ని ఆయన “వెరీ రొమాంటిక్”గా అన్నారు. ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాలను కూడా తాను ఎంతో ఆనందంగా స్వీకరించానని, కొన్నిసార్లు భోజనం లేని రోజులు, పది కిలోమీటర్లు నడిచిన సందర్భాలు, లైట్ బాయ్‌గా, జూనియర్ ఆర్టిస్ట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవాలు తనను మరింత దృఢంగా మార్చాయని తెలిపారు. ఇలాంటి బహుముఖ అనుభవాలు తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారని ప్రశ్నించగా, తన జీవితంలో వృత్తి, రమ్యకృష్ణ, కొడుకు రిత్విక్ కృష్ణ తప్ప వేరే వ్యక్తిగత జీవితం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబ వ్యవహారాలలో రమ్యకృష్ణనే బాస్ అని, ఆమె ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని సరదాగా చెప్పారు. రమ్యకృష్ణతో ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగిందని, ఈ సమయంలో వెయ్యిసార్లు బ్రేకప్‌లు కూడా జరిగాయని వివరించారు. రోజూ, కొన్నిసార్లు రోజుకు మూడు నాలుగు సార్లు గొడవలు పడినప్పటికీ, తాము సోల్మేట్స్గా భావిస్తామని తెలిపారు. తన కొడుకు రిత్విక్ కృష్ణ కార్లతో కూడిన కథలనే ఇష్టపడతాడని, బీఎండబ్ల్యూ కారు ఉంటేనే తన కథలు వింటాడని వెల్లడించారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో తన అనుబంధం గురించి వివరించారు. ఆయనను “దత్తత తీసుకున్నట్లు”గా భావిస్తానని, ఆయన జ్ఞానం, ఆలోచనా విధానం, విద్వత్తు తనపై తీవ్ర ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. సీతారామశాస్త్రి గారిని చూసినప్పుడు ఒక యోగిని, మహర్షిని చూసిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..