Headlines

మీ ఇంట్లో రోజూ 10 గంటలు లైట్లు వేస్తే ఎంత కరెంట్ బిల్లు వస్తుందంటే..? ఈ లెక్క తెలుసుకోండి..


ప్రస్తుతం ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఎల్ఈడీ బల్బులు ఉపయోగిస్తున్నారు. సాధారణ లైట్లతో పోలిస్తే ఎల్‌ఈడీ బల్బులు అనేవి తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుతురును అందిస్తాయి. దీంతో విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు ప్రతీఒక్కరూ తమ ఇళ్లల్లో ఎల్ఈడీ లైట్లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే మెరుగైన ఎల్‌ఈడీ బల్బులు లభిస్తున్నాయి. దీంతో ఈ బల్బులు ఎంతసేపు వాడినా తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ బల్బుల వాటేజ్, వినియోగం సమయం, ఇంట్లోని లైట్ల సంఖ్యను బట్టి కరెంట్ బిల్లుపై ప్రభావితం చూపిస్తుంది. మీరు ఎల్ఈడీ బల్బులను ఎంత సమయం వాడుతున్నారనే దాని బట్టి  ఉంటుంది. మీరు ఎన్ని వాట్ల సామర్థ్యం ఉన్న ఎల్ఈడీ బల్బులను ఎంతసేపు వాడితే ఎంత పవర్ బిల్లు వస్తుందనేది తెలుసుకుందాం.

10 ఎల్ఈడీ లైట్లు 10 గంటలు వాడితే..

మనం చూస్తే సాధారణంగా ఇళ్లల్లో 5,9,12 వాట్ల ఎల్ఈడీ బల్బులను వాడటం చూస్తుంటాం. మీరు ఇంట్లో 5 వాట్ల లైట్స్ ఉపయోగిస్తే కరెంట్ ఆదా అవుతుంది. అదే 9 వాట్ల బల్బులను 10 ఉపయోగిస్తే మొత్తం 90 వాట్ల కరెంట్ వినియోగించుకుంటాయి. అంటే 0.09 కిలోవాట్లుగా చెప్పవచ్చు. ప్రతీ రోజూ మీరు 10 బల్బులను 10 గంటల పాటు వినియోగిస్తే రోజుకు 0.9 యూనిట్ల విద్యుత్ ఖర్చువుతుంది. అదే 30 రోజులకు 27 యూనిట్లను వినియోగిస్తుంది. మీ ప్రాంతంలో యూనిట్ విద్యుత్ టారిఫ్ ధర రూ.6గా ఉందనుకుందాం. అప్పుడు 27 యూనిట్లకు రూ.162 ఖర్చవుతుందని చెప్పవచ్చు. మీ ప్రాంతంలోని విద్యుత్ టారిఫ్‌లను బట్టి లెక్క వేసుకోండి. అన్ని ప్రాంతాల్లో ఒకేలా యూనిట్ ధరలు అనేవి ఉండవు. దీని ఆధారంగా మీరు కరెంట్ బిల్లు లెక్కవేసుకోవచ్చు.

విద్యుత్ ఆదా చేసుకోవాలంటే ఏం చేయాలి..?

విద్యుత్ ఆదా చేసుకోవాలంటే మీరు ఇంట్లో కొన్ని టిప్స్ పాటించాలి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైట్లను బంద్ చేయాలి. పగటిపూట ఇంట్లో లైట్లను ఆన్ చేసే బదులు కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల వెలుతురు వస్తుంది. దీని వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. కొత్త బల్బులు కొనుగోలు చేసేముందు స్టార్ రేటింగ్, నాణ్యత, రిజిస్టర్డ్ కంపెనీ వంటివి చూసుకోండి. క్వాలిటీ కలిగిన బల్బులు వాడటం వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా ఎక్కువకాలం పనిచేస్తాయి. దీంతో నాణ్యమైన ఎల్ఈడీ బల్బులను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. చాలామంది అవసరం లేకపోయినా నిరంతరం ఇంట్లో లైట్లను ఆన్ చేసి ఉంచుతారు. ఇది తగ్గించుకోవాలి. ఇవన్నీ పాటించడం వల్ల విద్యుత్ ఆదా చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *