Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నుంచి నీతూ మాస్టర్ ఎలిమినేట్.. 6 వారాలకు ఎంత సంపాదించారో తెలుసా?


బిగ్ బాస్ హౌస్ నుంచి నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం (నవంబర్ 22) వీకెండ్ ఎపిసోడ్ లో ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన నీతూ మాస్టర్ కేవలం ఆరు వారాలకే తన బిగ్ బాస్ ప్రయాణాన్ని ముగించింది. 11 వారం ఎలిమినేషన్ కు సంబంధించి కెప్టెన్ జబర్దస్త్ నరేష్ మినహా మొత్తం 11 మంది నామినేషన్స్ లో నిలిచారు. త్రిగుణ్, ముఖేష్, అమన్, దేబ్జాని, రామకృష్ణ, వర్షిణి, రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, శివ, నీతు మాస్టర్ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొన్నారు. అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న వారు ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి తక్కువ ఓట్లు సొంతం చేసుకున్న సుధీర్, నీతూ మాస్టర్ బాటమ్ లో మిగిలారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ నాటకీయ పరిణమాల మధ్య సాగింది. నాగార్జున వారిద్దరికీ కళ్ళకు గంతలు కట్టమని చెప్పారు. దీనితో అమన్, ముకేశ్ వారికి కళ్ళ గంతలు కట్టి గార్డెన్ ఏరియాకు తీసుకుని వచ్చారు. అనంతరం వీరిద్దరినీ తీసుకెళ్లడానికి సుజుకీ కంపెనీ కారు వచ్చింది. ఇద్దరూ కారులో బయటకు వెళ్లారు. తిరిగి కారు వెనక్కి వచ్చినప్పుడు అందులో ఒక్కరే ఉంటారు. ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున చెప్పారు. ఎవరు వెనక్కి తిరిగి వస్తారు అని నాగార్జున ఇంటి సభ్యులని గెస్ చేయమన్నారు. ఎక్కువ మంది నీతూ మాస్టర్ తిరిగి వస్తుందని చెప్పారు. కానీ ఆమె రాలేదు. సుధీర్ తిరిగి వచ్చాడు. దీనితో నీతూ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు..

ఇక ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ స్టేజీ పైకి వెళ్లిన నీతూ.. తాను హౌస్ నుంచి వెళ్లిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు. హౌస్ లో ఉండలేకపోయాను. ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. హౌస్ లో త్రిగున్, అమన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అని నీతూ ప్రశంసలు కురిపించింది. వర్షిణి, ముకేశ్, సుధీర్ గేమ్ ఆడట్లేదు అని పేర్కొంది. నీతూ మాస్టర్ ఎలిమినేషన్ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ ద్వారా ఆమె అందుకున్న పారితోషకం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన నీతూ మాస్టర్ ఆరువారాలపాటు హౌస్ లో కొనసాగారు. సాధారణంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే కొరియోగ్రాఫర్లు లేదా సెలబ్రిటీలకు వారానికి సుమారు 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 6 వారాలకు గాను నీతూ మాస్టర్ సుమారు రూ.7.2 లక్షల నుంచి 9 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి



బిగ్ బాస్ బజ్ షోలో నీతూ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *