రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రం ‘మైసా’. ఈ చిత్రంలో రష్మిక మందన్న తొలిసారిగా హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించింది. సినిమా పోస్టర్స్, టీజర్లలోనూ రష్మిక చాలా పవర్ ఫుల్ యాక్షన్ సీన్లలో కనిపించింది. ఈ కారణంగా, రష్మిక అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నవంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలకు నాలుగు రోజుల ముందు, సినిమా విడుదల వాయిదా పడింది. ‘మైసా’ నిర్మాతలు, అన్‌ఫార్ములా ఫిల్మ్స్, దర్శకుడు రవీంద్ర, ‘మైసా’ విడుదల వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.. ‘ తెలుగు సినిమా నుంచి సాంకేతికంగా ఉన్నతమైన, విలక్షణమైన యాక్షన్ ఎపిక్‌గా మైసా తెరకెక్కింది. ఇది వెండితెరపై ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ విజన్‌ను ప్రేక్షకులకు ఎలాంటి రాజీ లేకుండా అందించడానికి, నవంబర్ 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేట్రికల్ విడుదలను వాయిదా వేయాలని మేమంతా సమిష్టిగా నిర్ణయించుకున్నాం. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాము, మీ నిరంతర ప్రేమ, సహనం, మద్దతుకు ధన్యవాదాలు. ఈ నిరీక్షణ ఎక్కువ కాలం ఉండదని మేము మీకు హామీ ఇస్తున్నాం’ అని ప్రకటించారు మైసా దర్శక నిర్మాతలు.
ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘మైసా’ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కావాల్సి ఉంది. ఇందులో ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రకని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తీక్ రంజని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘మైసా’ ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో సరికొత్త అవతారంలో కనిపించనుంది. గిరిజన గోండు అమ్మాయి పాత్రలో ఆమె పవర్ఫుల్ రోల్ పోషించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓసేయ్ రాములమ్మ రీమిక్స్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
మైసా దర్శక నిర్మాతల ట్వీట్..
We wish to present the world of #MYSAA in its most uncompromised form, delivering the experience it truly deserves.
With this vision in mind, the theatrical release of #MYSAA, originally scheduled for NOVEMBER 27th, has been POSTPONED.
The new release date will be announced very soon.
Until then, keep the energy alive and groove to the rage-filled #OseyRamulamma ❤️🔥🎶
— https://t.co/TKCU7BiuaN
@iamRashmika @RawindraPulle @unformulafilms @TSeries @tseriessouth
— UnFormula Films (@unformulafilms) November 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.