Headlines

ఏపీలో 2,111 టీచర్ పోస్టులు..సబ్జెక్టుల వారీగా పోస్టుల లిస్ట్..ఇలా దరఖాస్తు చేసుకోండి


ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు విద్యాశాఖ ఒక శుభవార్త అందించింది. ఏపీ డీఎస్సీ 2026 ద్వారా మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి: సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) మరియు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ). ఎస్జీటీ విభాగంలో 1,205 పోస్టులు ఉండగా, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 906 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. యాజమాన్యాల వారీగా చూస్తే, ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 1,709 పోస్టులు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 402 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీతో పాటు ఎన్సీటీఈ/ఆర్సిఐ గుర్తింపు పొందిన టీచర్ ట్రైనింగ్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ఏపీ టెట్ పేపర్ 1 లేదా పేపర్ 2 లేదా సీ టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి జూలై 1, 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30, 2026. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు డిసెంబర్ 20 నుంచి నిర్వహించబడతాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: హైదరాబాద్ ఆకాశంలో ఉల్కాపాతం.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *