Headlines

Numerology: అల్లరి పిల్లల వెనుక దాగి ఉన్న తెలివితేటలు.. ఈ తేదీల్లో పుట్టినవారి ప్రత్యేకతలివే!


Naughty Intelligent Kids Numerology: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తారు. కానీ కొంతమంది పిల్లలకు పుస్తకాల కంటే ఆటలు, స్నేహితులతో అల్లరి, కొత్త ప్రయోగాలు చేయడమే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. చదువుకోమని ఎంత చెప్పినా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోలేరు. నీళ్ల కోసమనో, మరేదో సాకు చెప్పి లేచిపోతుంటారు. సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం, మూలాంకం 3, 4, 5, 9 కలిగిన పిల్లలు ఎంతో తెలివైనవారైనప్పటికీ, చదువు కంటే ఆటపాటల్లోనే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. వారి స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

మూలాంకం 5 (ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు):

ఈ మూలాంకానికి అధిపతి బుధుడు. బుధుడు తెలివితేటలు, వాక్చాతుర్యానికి కారకుడు. అందువల్ల ఈ పిల్లలు చాలా చురుగ్గా, చంచల స్వభావంతో ఉంటారు. వీరికి ఒకే పనిని ఎక్కువసేపు చేయడం నచ్చదు. పుస్తకం పట్టుకున్న కాసేపటికే బోర్ ఫీల్ అవుతారు. నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని, కొత్త ఆటలు ఆడాలని కోరుకుంటారు. వీరిపై ఒత్తిడి తేకుండా, ఆటపాటల ద్వారా ఆసక్తికరంగా పాఠాలు నేర్పితే త్వరగా గ్రహిస్తారు.

మూలాంకం 4 (ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు):

ఈ మూలాంకానికి అధిపతి రాహువు. వీరు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. మూస పద్ధతిలో చదవడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లోని వస్తువులతో కొత్త ప్రయోగాలు చేయడం, సొంతంగా ఆటలు సృష్టించడం వీరికి ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు వీరి ఆసక్తిని అణచివేయకుండా, సృజనాత్మక పద్ధతుల్లో చదువు చెప్పడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి



మూలాంకం 9 (ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు):

వీరికి అధిపతి అంగారకుడు (కుజుడు). కుజుడు శక్తి, సాహసం, ఉత్సాహానికి ప్రతీక. అందుకే ఈ పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా పరిగెడుతూ, సైకిల్ తొక్కుతూ, ఆటల్లో మునిగిపోతారు. వీరిని ఒకే చోట కట్టేసి చదివించడం చాలా కష్టం. చదువు మధ్యలో చిన్న విరామాలు (బ్రేక్స్) ఇస్తూ, శారీరక శ్రమతో కూడిన ఆటలకు సమయం కేటాయిస్తే వీరు చదువులోనూ రాణిస్తారు.

మూలాంకం 3 (ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు):

ఈ మూలాంకానికి అధిపతి గురువు (బృహస్పతి). జ్ఞానానికి కారకుడైన గురువు ప్రభావంతో వీరికి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. చదువుతున్నప్పుడు కూడా పాఠం కంటే ఇతర ఆలోచనల్లోకి వెళ్లిపోతారు, తల్లిదండ్రులను రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. వీరికి కథలు, బొమ్మలు, ఉదాహరణల ద్వారా పాఠాలు బోధిస్తే చదువుపై ఆసక్తి పెరుగుతుంది.

మొత్తానికి ఈ నాలుగు మూలాంకాల (పుట్టిన తేదీ) పిల్లలు సహజంగానే మేధావులు. వీరి అల్లరిని, ఉత్సాహాన్ని సరైన మార్గంలో మళ్లిస్తే చదువులోనూ అద్భుతాలు సృష్టిస్తారు.

(Disclaimer: ఈ సమాచారం సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ), సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా అందించబడింది. ఇవి కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే; పిల్లల చదువు, ప్రవర్తన లేదా వ్యక్తిగత నిర్ణయాలకు వీటిని ఖచ్చితమైన శాస్త్రీయ లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించకూడదు.)

మరిన్ని ఆసక్తికర జ్యోతిష్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *