Headlines

కలలో కనిపించిన వజ్రం.. తవ్వితే నిజంగానే దొరికింది! ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం!


మధ్యప్రదేశ్‌లో ఓ ఆటో డ్రైవర్‌కు అనూహ్య అదృష్టం వరించింది. కలలో వజ్రాలు కనిపించడంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించిన అతడికి నిజంగానే విలువైన వజ్రం లభించింది. పన్నా జిల్లాలో లీజుకు తీసుకున్న భూమిలో తవ్వకాలు జరపగా ఏకంగా 3.17 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన సోను రైక్వార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత 10 నుంచి 15 రోజులుగా తన కలల్లో వజ్రాలు కనిపిస్తున్నాయని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారి సలహా మేరకు పన్నా డైమండ్ ఆఫీస్ నుంచి భూమిని లీజుకు తీసుకుని రాణిపూర్ ప్రాంతంలో వజ్రాల కోసం తవ్వకాలు ప్రారంభించాడు. సుమారు 15 రోజుల పాటు శ్రమించిన తర్వాత శుక్రవారం (నవంబర్ 20) అతడికి 3.17 క్యారెట్ల వజ్రం లభించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. తన కల నిజమైందని సోను సంతోషం వ్యక్తం చేశాడు.

కాగా, దొరికిన వజ్రాన్ని సోను రైక్వార్ పన్నా డైమండ్ ఆఫీస్‌లో అధికారులకు అప్పగించాడు. తదుపరి వేలంలో దీనిని విక్రయించనున్నారు. రత్నపు నాణ్యత కలిగిన ఈ వజ్రానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని నిపుణుడు అనుపమ్ సింగ్ తెలిపారు. వేలంలో వచ్చే డబ్బుతో మళ్లీ తవ్వకాలు చేపట్టి మరిన్ని పెద్ద వజ్రాలను వెతుకుతానని సోను వెల్లడించాడు. ఆటో నడుపుతూ జీవనం సాగించే వ్యక్తికి ఒక్క వజ్రం రూపంలో రూ.15 లక్షల అదృష్టం దక్కడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కలలో కనిపించిన వజ్రం నిజ జీవితంలో దొరకడంతో సోను ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *