Headlines

రైళ్ల ద్వారా పార్శిళ్లు పంపిస్తున్నారా..? ఈ టైమ్‌లోగా తీసుకెళ్లకపోతే ఫైన్.. గంటకు ఎంతంటే..?


రైల్వేశాఖ పార్శిల్ సేవలు కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే. అంటే మీరు ట్రైన్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొ ప్రాంతానికి వస్తువులు పంపించవచ్చు. బైక్‌ల‌తో పాటు ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్ లాంటి గృహోపకరణాలు పంపవచ్చు. రైల్వేశాఖ అనుమతించిన ఇతర వస్తువులను కూడా రైళ్ల ద్వారా పార్శిల్ రూపంలో తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పార్శిల్ ద్వారా పంపిన వస్తువులను గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత నిర్ణీత సమయంలోగా తీసుకోవాలి. లేకపోతే ఆలస్య ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వీటి గురించి అవగాహన లేకపోతే మీ పార్శిల్‌కు ఎక్స్‌ట్రా లేట్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. వీటినే వార్పే్జ్ ఛార్జీలుగా పిలుస్తారు. ఆలస్యం అయిన సమయానికి గంటల చొప్పున ఈ ఆలస్య ఛార్జీలు వసూలు చేస్తారు.

ఈ సమయంలోగా తీసుకెళ్లకపోతే పెనాల్టీలు

సాధారణ పార్శిళ్లు, లగేజీ గమ్యస్థానికి చేరుకుని అన్‌లోడ్ చేసిన తర్వాత 10 గంటల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 10 గంటల వరకు ఎలాంటి ఛార్జీలు పడవు. ఆలోగా తీసుకెళ్లకపోతే పెనాల్టీలు విధిస్తారు. ఇక బైక్‌లు, స్కూటర్లు లాంటివి గమ్యస్థానానికి చేరుకున్న 6 గంటల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే 6 గంటల్లోగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీలు విధిస్తారు.

లేట్ ఛార్జీలు ఎంతంటే..?

సాధారణ పార్సిళ్లు, లగేజీకి సంబంధించి నోటిఫైడ్ చేసిన ప్రధాన స్టేషన్లో గంటకు 50 కిలోల వరకు రూ.1, నోటిఫై చేయని స్టేషన్లలో రూ.0.50 పెనాల్టీ ఉంటుంది. ఇక బైక్, స్కూటీకి గంటకు రూ.10 పెనాల్టీ అన్ని స్టేషన్లలో విధిస్తారు. 3 లేదా 4 చక్రాల వాహనానికి గంటకు రూ.25 పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ ఎక్కువకాలం పాటు పార్సిళ్లను తీసుకెళ్లకపోతే రైల్వేశాఖ వేలం వేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే  పార్సెల్ వ్యాన్‌లు (VPలు) లేదా SLRలను ఉపయోగించి చేసే బల్క్ బుకింగ్‌లకు వ్యాన్‌ల సంఖ్యను బట్టి అన్‌లోడింగ్‌కు 3 నుండి 8 గంటల కంటే ఎక్కువ సమయం పడితే అదనపు ఛార్జీలు విధిస్తారు. వీటిని డెమరేజ్ ఛార్జీలుగా పిలుస్తారు. మీరు రైళ్ల ద్వార పార్సిళ్లు పంపిస్తుంటే ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అదనపు పెనాల్టీల రూపంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. చాలామందికి ఈ పెనాల్టీల గురించి తెలియక ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు. గతంలో పార్శిల్ పంపించాలంటే రైల్వే పార్శిల్ కార్యాలయానికి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా పార్శిల్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే సిబ్బంది ఇంటికి వచ్చి తీసుకెళ్లే సదుపాయం అమల్లోకి వచ్చింది. దీని వల్ల మీరు రైల్వే పార్శిల్ కార్యాలయానికి వెళ్లే అక్కడ వెయిట్ చేసే పని ఉండదు. ఇక పార్శిల్ ఛార్జీలు బరువు, మీరు పంటే వస్తువు బట్టి మారుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *