కుంభ రాశి వారికి 2027 అనేది ఒక పెద్ద పరీక్ష ముగిసే సమయం లాంటిది. చాలా ఏళ్లుగా ఎలినాటి శని ప్రభావంతో ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి డబ్బు సమస్య, ఒక్కోసారి మనుషులతో గొడవ, ఒక్కోసారి కారణం లేని భయం వీటన్నింటితో ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ 2027 లో ఆ భారం కొంచెం కొంచెంగా తగ్గుతున్నట్టు మీకే అర్థమవుతుంది. మీరు ఇన్నాళ్లు పడిన కష్టం వృథా కాదు, మీకు మంచి రోజులు రానున్నాయి.
పని విషయంలో ఈ ఏడాది మీకు కొంచెం నెమ్మదిగా మొదలవుతుంది. చేసిన పనికి పేరు రాకపోవడం, ఎవరో క్రెడిట్ కొట్టేయడం, అనుకున్న టైంకి జీతం పెరగకపోవడం వంటివి జరుగుతుంది. ఇది కాస్త నిరాశను కలిగిస్తుంది. కానీ కొత్త ఉద్యోగం కోసం చూసే వారికి, సొంతంగా ఏదైనా మొదలుపెట్టాలనుకునే వారికి ఏడాది రెండో భాగం కలిసి వస్తుంది. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం.
డబ్బు విషయంలో 2027 మీకు ఒక పాఠం నేర్పుతుంది. చేతికి డబ్బు వస్తుంది, కానీ అదే చేత్తో ఖర్చు కూడా అయిపోతుంది. ఇంటి పనులు, పిల్లల అవసరాలు, అనుకోని ఖర్చులు వెంటాడతాయి. అందుకే ఈ ఏడాది పెద్ద ఆశలు పెట్టుకోకుండా, ఉన్నదానిలోనే జాగ్రత్తగా నడవడం మంచిది. ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఎవరి మాట నమ్మి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. చిన్న చిన్నగా దాచుకుంటూ పోతే ఏడాది చివరికి మీ చేతిలో కొంత మిగులుతుంది, అదే మీకు ధైర్యాన్నిస్తుంది.
ఇంట్లో వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చెప్పేది ఇంట్లో వాళ్లకు అర్థం కాకపోవడం, మీ మౌనాన్ని వాళ్లు కోపం అనుకోవడం జరగచ్చు. దీనికి ఒక్కటే మందు, కోపాన్ని తగ్గించుకుని మాట్లాడటం. మీ ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకండి. కాళ్లు, నడుము నొప్పి, గ్యాస్, నిద్ర సరిగా పట్టకపోవడం వంటివి ఎక్కువ అవుతాయి. రోజూ కాసేపు నడవడం, వేడి నీళ్లు తాగడం, ఫోన్ తక్కువ చూడటం చేస్తే చాలు, శరీరం తేలికపడుతుంది.
ఏలినాటి శని చివరి దశ ఈ ఒక్క సంవత్సరం పూర్తి అయితే మీరు చాలా ఆనందంగా గడిపే రోజులు రావడం ఖాయం. అందువలన మీరు ఆచీ తూచీ అడుగు వేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎంత ఓపికగా ఉంటే, అంత ముందుకు సాగుతారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




