Headlines

TGSRTC: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. హైదరాబాద్ జోన్‌లో 63 మందికి ప్రమోషన్లు


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మొత్తం 63 మంది ఉద్యోగులకు వివిధ ఉన్నత హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 25-05-2025న నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ రాత పరీక్షతో పాటు, 27-07-2025న నిర్వహించిన కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు తాజాగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పదోన్నతుల వివరాలు

జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) విభాగంలో మొత్తం 28 మంది పదోన్నతులు పొందగా వారిలో 23 మంది కండక్టర్లు, 3 మంది డ్రైవర్లు, 2 మంది ఆఫీసర్లు (RCs) ఉన్నారు. ఇక
జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్) విభాగంలో 27 మంది పదోన్నతి పొందగా వారిలో 27 మంది కండక్టర్లు ఉన్నారు. ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) విభాగంలో 8 మంది పదోన్నతి పొందగా వారిలో డిపో కంట్రోలర్లు , ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు , ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు నుంచి మొత్తం 8 మందికి డిప్యూటీ సూపరింటెండెంట్‌లు ఉన్నారు.

వీసీ అండ్ ఎండీ అభినందనలు

ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ అభినందనలు తెలియజేస్తూ, వారు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి సంస్థ ప్రతిష్టను పెంపొందించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాగే టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుశ్రో షా ఖాన్ మాట్లాడుతూ, పదోన్నతులు పొందిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల ప్రతిభ, అర్హతలకు తగిన గుర్తింపునిస్తూ పదోన్నతులు కల్పించడం ద్వారా సిబ్బందిలో మరింత ఉత్సాహం, పని పట్ల నిబద్ధత పెరుగుతాయని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *