Headlines

Jabardasth Babu: ఏడేళ్ల ప్రేమ.. ఎట్టకేలకు ప్రియురాలితో కలిసి ఏడడుగులు నడిచిన జబర్దస్త్ బాబు.. పెళ్లి వీడియో ఇదిగో


జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డేగల బాబు. ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అలాగే డైరెక్టర్ గా బాబుకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ ఆనందంలో ఉండగానే మరో గుడ్ న్యూస్ చెప్పాడు జబర్దస్త్ బాబు. తను ప్రేమించిన అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడీ స్టార్ కమెడియన్. శుక్రవారం (నవంబర్ 20) బాబు వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్వయంగా అతనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డేగల బాబు వివాహ వేడుకకు జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలందరూ తరలి వచ్చారు. సునీత, టేస్టీ తేజ, జిత్తు , సందీప్, పంచ్ ప్రసాదు, నూకరాజు వంటి వాళ్లంతా వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం బాబు పెళ్లి వీడియోకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఈ కామెడీ షోలోకి అడుగు పెట్టిన బాబు ఇప్పుడు టాప్ కమెడియన్ గా మారిపోయాడు. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ మెరుస్తున్నాడీ స్టార్ కమెడియన్. కేవలం నటనలోనే కాదు స్క్రిప్ట్ రైటింగ్ లోనూ డేగల బాబుకు మంచి ప్రావీణ్యం ఉంది. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలో కోసం వందలాది స్కిట్స్ రాశాడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అయిన బాబు ఇటీవలే మెగా ఫోన్ పట్టుకున్నాడు. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను పలకరించాడు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ జనాలను బాగా నవ్వించింది.

ఇవి కూడా చదవండి



జబర్దస్త్ బాబు పెళ్లి వీడియో..

ఇక బాబు భార్య పేరు అమూల్య. వీరిది ప్రేమ వివాహం. గత ఏడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ విషయాన్ని బాబునే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక అమూల్య విషయానికి వస్తే ..ఈమె బి ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో యాంకర్ గా కూడా పనిచేసింది. యాంకర్ గా న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న సమయంలోనే బాబుతో పరిచయం ఏర్పడింది. మొదట మంచి స్నేహితులుగా మారిన వీరు ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. కాగా ప్రొఫెషనల్ కెరీర్ పరంగా బాబు ఎదగడంలో అమూల్య ప్రోత్సాహం ఎంతో ఉందట. కాగా కనీసం ఒక్క సినిమా అయినా చేసి, స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనుకున్నాడట బాబు. అందుకే ఇన్నేళ్లు వెయిట్ చేశారట ఈ లవ్ బర్డ్స్. ఇప్పుడు డైరెక్టర్ గా హిట్ కొట్టడంతో ఇరు పెద్దల ఆశీర్వాదంతో అమూల్యను పెళ్లి చేసుకున్నాడు బాబు.

పెళ్లి వేడుకలో జబర్దస్త్ సెలబ్రిటీలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *