Headlines

Child Artist: ఏందమ్మడు ఇది నువ్వేనా.. హీరోయిన్ రేంజ్‏లో మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్.. అయినా సినిమాలకు దూరంగా..


తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన క్లాసిక్ లవ్ స్టోరీలలో ‘మనసంతా నువ్వే’ ఒకటి. 2001లో వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్, రీమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్పీ పట్నాయక్ స్వరపరిచిన పాటలు అప్పట్లో థియేటర్లను షేక్ చేశాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఈ మూవీ స్టోరీ సైతం అప్పట్లో యూత్ కు తెగ కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టులు సైతం బాగా పాపులర్ అయ్యారు. అయితే ‘తూనీగ తూనీగ’ పాటతో పాటు కథలో రీమా సేన్ చిన్ననాటి పాత్రలో కనిపించిన బాలనటి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆ చిన్నారి పేరు సుహాని కలిత . తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఆమె లుక్స్ చూసి షాకవుతున్నారు అడియన్స్.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

‘మనసంతా నువ్వే’లో తన అమాయకమైన నటనతో మెప్పించిన సుహాని, ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ నటించి మంచి మార్కులు కొట్టేశారు. అయితే కేవలం చైల్డ్ ఆర్టిస్టుగానే కాకుండా కథానాయికగానూ తెరంగేట్రం చేశారు. చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ఆ తర్వాత కొంతకాలానికే కథానాయికగానూ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగులో ‘శ్రీశైలం’, ‘స్నేహగీతం’ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, సినిమా రంగంలో ఆమెకు వరుస అవకాశాలు లభించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

వెండితెర అవకాశాలు తగ్గడంతో సుహాని సినిమా రంగానికి క్రమంగా దూరమయ్యారు. వ్యక్తిగత జీవితంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విభిన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఆ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఫాలోవర్లను అలరిస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుహాని, ఇటీవల షేర్ చేసిన ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. నాటి బాలనటి ఇప్పుడు పూర్తిగా మారిపోయిన తీరు, ఆమె స్టైల్ చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెరపై ముద్దుముద్దుగా కనిపించిన చిన్నారి ఇంతలా మారిపోయిందా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Child Artist Suhani

Child Artist Suhani

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *