అర చేతిలో ప్రపంచం.. అంతా ఏఐ మాయాజాలం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఎంతగా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంత కఠినమైన పనైనా.. ఏఐ ఇట్టె సొల్యూషన్ చెప్పేస్తుంది. ఏం చేయాలో చెబుతుంది.. ఏం చేయకూడదో కూడా హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా.. సందేహం వచ్చినా.. నో టెన్షన్.. ఏఐ ఉందిగా అని ఠక్కున చెప్పేస్తున్నారు.. వాస్తవానికి కృత్రిమ మేధస్సు మన జీవితాలను ఎంతో సులభతరం చేసింది.. కానీ అదే స్థాయిలో కొత్త తరహా మోసాలకు కూడా దారితీసింది. కష్టమైన పనులను చిటికెలో పూర్తి చేసే ఈ సాంకేతికత, సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రమాదకరమైన ఆయుధంగా మారింది. ఏఐని ఉపయోగించి.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ ఆడియోలు, వీడియోలు, సందేశాలు, వెబ్సైట్లను సృష్టించి వ్యక్తులను లేదా సంస్థలను మోసం చేస్తున్నారు. ఇటీవల డీప్‌ఫేక్ దుర్వినియోగం, స్మార్ట్ గ్లాసెస్ వంటి AI సాధనాలతో పరీక్షల్లో మోసాలపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇష్టం వచ్చినట్లు సెలబ్రిటీల ముఖాలు మార్చేయడం… ఫేక్ వీడియోలతో ప్రజలను మోసం చేయడం పరిపాటిగా మారింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న ఏఐ డీప్‌ఫేక్’ (Deepfake) ముప్పు ఇప్పుడు సామాన్యుల ప్రాణాలకు, పరువుకు పెద్ద శిక్షగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, ముప్పుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా నియంత్రించకపోతే మానవాళికి పెను సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.. అయితే.. ఈ ఏఐ (AI) దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి నూతన పోరాటానికి తెరలేపారు.. కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి డిజిటల్ భద్రత కోసం ఆయన నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపాలని కోరారు. అసలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో చిరంజీవి ఏం చర్చించారు? ఏఐ చట్టాలపై మెగాస్టార్ డిమాండ్స్ ఏంటో ఈ రోజు వీడియోలో ఇన్-డెప్త్‌గా చూద్దాం! గత కొంతకాలంగా సాంకేతికతను కొందరు కేవలం సృజనాత్మకత కోసం కాకుండా, బ్లాక్మెయిల్ చేయడానికి, మోసాలకు విచ్చలవిడిగా వాడుతున్నారు. ప్రముఖుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి నకిలీ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం. వ్యక్తుల పేర్లతో తప్పుడు ప్రచారాలు చేస్తూ డిజిటల్ మోసాలకు పాల్పడడం. ఇది కేవలం సెలబ్రిటీలకే కాకుండా సామాన్య ప్రజల జీవితాలను కూడా రోడ్డున పడేస్తోందని చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీవ్రమైన సమస్యపై మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హైదరాబాద్‌లో కలిసిన సంగతి తెలిసిందే. అమిత్ షా సూచన మేరకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి అధికారికంగా ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు – డిజిటల్ నకిలీ గుర్తింపులకు వ్యతిరేకంగా మరింత పటిష్ఠమైన రక్షణ చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ అంశాలపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించుకోవడాన్ని అందరం స్వాగతించాలని… కానీ దాని దుర్వినియోగం వల్ల ఎవరికీ నష్టం జరగకుండా కఠినమైన భద్రతా వ్యవస్థ ఉండాలని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (X) వేదికగా స్పందిస్తూ… ప్రతి పౌరుడి భద్రతతో పాటు, కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను పరిరక్షించడం మన అందరి ఉమ్మడి బాధ్యత. సాంకేతికత వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించకూడదు అని అభిప్రాయం వ్యక్తంచేశారు. సమాజంలో ఏఐ డీప్‌ఫేక్ మోసాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి. చిరంజీవి తీసుకున్న ఈ సామాజిక స్పృహతో కూడిన నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా.. డాన్సులతో అలరించిన గిరిజనులు
వామ్మో.. చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు
సీతాఫలం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ విషయాలు అస్సలు మిస్ అవ్వకండి!
జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!
స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచులు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్..