Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన శివాజీ.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు నో ఛాన్స్


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో దాదాపు చివరి దశ ప్రారంభమైనట్లే అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది. పదకొండో వారం కూడా దాదాపు వీకెండ్ కు వచ్చేసింది. మహా అంటే మరో నెల రోజులు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే టికెట్ టు ఫినాలే కోసం పోటీ ప్రారంభమైంది.
టాప్ 5లో చోటు దక్కించుకోవడం కోసం కంటెస్టెంట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు? టాప్-5లో ఎవరుంటారు? అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బుల్లితెర సెలబ్రిటీలు, మాజీ కంటెస్టెంట్స్ కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రస్తుత బిగ్ బాస్ బజ్ హోస్ట్ బిగ్ బాస్ 10 ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న శివాజీ బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. విజేతగా నిలవకపోయినా సెకండ్ రన్నరప్ గా నిలిచి బిగ్ బాస్ ప్రేక్షకుల మన్ననలు గెల్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేస్తున్నారు శివాజీ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ టాక్ షోక అతిథిగా వెళ్లారీ సీనియర్ నటుడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు 10లో టాప్ లో ఎవరెవరు ఉంటారో జోస్యం కూడా చెప్పారు.

శివాజీ అంచనాల ప్రకారం.. ముకేష్, త్రిగుణ్, నరేష్, దేబ్జానీ తప్పనిసరిగా టాప్ -5లో ఉంటారట. అయితే ఐదవ వ్యక్తి ఎవరనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు శివాజీ. ఐదవ వ్యక్తిగా జబర్దస్త్ రామ్ ప్రసాద్, అమన్ మసూద్, టెంపర్ వంశీ లలో ఎవరైనా ఉండొచ్చు అని శివాజీ చెప్పుకొచ్చారు. దీంతో ఈ నటుడి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పదకొండో వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. త్రిగుణ్, వర్షిణి, ముఖేష్, దెబ్జానీ, రాంప్రసాద్, శివ, నీతూ మాస్టర్, సుధీర్ ఈ వారం ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. వీరిలో యాంకర్ వర్షిణీ లేదా సుధీర్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరూ బయటకు వెళతారని కూడా ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *