Headlines

Video: ఔట్‌ను నాటౌట్ అంటూ అంపైర్ మోసం.. గిల్ నెత్తినోరూ బాదుకున్న వినలే.. చివరకు..!


Drs Controversy In Wellington Shubman Gill Confronts Umpire After Glenn Phillips Reprieve

IND vs NZ Umpire Decision Controversy: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నిర్ణయం కారణంగా భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగలగా, న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లేందుకు అవకాశం లభించింది.

మ్యాచ్ ప్రారంభంలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేస్తూ కేవలం 70 పరుగులకే ఐదు కీలక వికెట్లను పడగొట్టారు. తొలి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లతామ్ వికెట్‌ను తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు తీసి 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయేలా చేశారు. ఐదో వికెట్ 70 పరుగుల వద్ద పడగా, ఈ దశలో న్యూజిలాండ్‌ను 100 నుంచి 120 పరుగుల లోపు ఆలౌట్ చేస్తారని అంతా భావించారు.

అయితే, అక్కడి నుంచి హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నికోలస్ సెంచరీతో దూసుకెళ్లగా, ఫిలిప్స్ కూడా సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ కీలక భాగస్వామ్యం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో, ఒక కీలక సంఘటన జరిగింది.

జస్ప్రీత్ బుమ్రా వేసిన 31వ ఓవర్‌లో, మూడో బంతి గ్లెన్ ఫిలిప్స్ బ్యాట్‌ను దాటి నేరుగా ప్యాడ్లను తాకింది. బంతి చాలా లోపల నుంచి వచ్చి బ్యాట్‌ను తాకకుండా ప్యాడ్‌లకు తగిలినట్లు కనిపించింది. దీంతో బుమ్రాతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరియు ఇతర ఆటగాళ్లు గట్టిగా ఎల్బీడబ్ల్యూ కోసం అపీల్ చేశారు. అయితే, ఆన్-ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ నాట్ అవుట్ గా ప్రకటించారు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవించని భారత కెప్టెన్ శుభమన్ గిల్ వెంటనే డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) ను ఆశ్రయించాడు.

రివ్యూలో భాగంగా, థర్డ్ అంపైర్ పాల్ రిఫెల్ బ్యాట్, బంతి మధ్య సంబంధాన్ని గుర్తించే సోనిక్ టెక్నాలజీని పరిశీలించారు. సోనిక్ టెక్నాలజీలో ఒక చిన్న స్పైక్ కనిపించడంతో, బంతి బ్యాట్ అంచుకు తగిలి ఉండవచ్చని థర్డ్ అంపైర్ భావించాడు. దీంతో అతను ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, గ్లెన్ ఫిలిప్స్‌ను నాట్ అవుట్ గా ప్రకటించాడు. అయితే, రిప్లేలలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించలేదు. ఈ నిర్ణయం భారత ఆటగాళ్లను నిరాశపరిచింది. శుభమన్ గిల్ కొద్దిసేపు అంపైర్‌తో మాట్లాడినప్పటికీ, నిర్ణయం మారలేదు.

ఈ వివాదాస్పద నిర్ణయం కారణంగా జస్ప్రీత్ బుమ్రాకు లభించాల్సిన నాలుగో వికెట్ దక్కకుండా పోయింది. అప్పటికే మూడు వికెట్లు తీసిన బుమ్రాకు ఇది పెద్ద నష్టం. అత్యంత ముఖ్యంగా, గ్లెన్ ఫిలిప్స్ వికెట్ పడి ఉంటే, నికోలస్-ఫిలిప్స్ భాగస్వామ్యం విడిపోయి ఉండేది. ఇది న్యూజిలాండ్ స్కోర్ బోర్డును నిలువరించి, భారత జట్టుకు మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించే అవకాశం లభించి ఉండేది. అంపైర్ నిర్ణయం న్యూజిలాండ్‌కు లాభం చేకూర్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *