ఈ ఏడాది డిసెంబర్ 5న రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి మారడం జరుగుతుంది. రాహువు ఈ రాశిలో ఏడాదిన్నర పాటు..అంటే 2028 జూన్ వరకు సంచారం చేస్తాడు. మకర రాశి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాహువుకు మిత్రగ్రహం అయినందువల్ల ఈ రాశిలో రాహువు ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తాడు. రాహువు ఈ రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశులకు ఆయా రాశుల్ని బట్టి, స్థితిగతులను బట్టి రాజయోగాలను, ధన యోగాలను, భాగ్య యోగాలను ఇవ్వడం జరుగు తుంది. రాహువు వల్ల చెడు ఫలితాలను పొందే రాశులవారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం, గోమేధికం పొదిగిన ఉంగరం ధరించడం వల్ల ఈ ఫలితాల ప్రభావం తగ్గే అవకాశం ఉంది.
మేషం: ఈ రాశికి రాహువు దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల విదేశీ ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులు విదేశీ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.
వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. వారసత్వపు ఆస్తి లభించే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడం వంటివి జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మిథునం: ఈ రాశికి అష్టమ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కష్టనష్టాలు తప్పకపో వచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరుగుతాయి. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది.
కర్కాటకం: ఈ రాశికి సప్తమంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగంలోనే కాక, రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయివారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టి, బాగా సంపన్నులయ్యే అవకాశం ఉంది. మిత్రుల వల్ల మోసపోవడం జరుగుతుంది.
సింహం: ఈ రాశికి షష్ట స్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం గానీ, వ్యాపారాలు ప్రారంభించడం గానీ జరుగుతుంది. జీవనశైలి పూర్తిగా మారుతుంది. ఆకస్మిక ధన లాభాలు ఎక్కువగా కలుగుతాయి.
కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ప్రముఖులతో పరిచ యాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.
తుల: ఈ రాశినాథుడైన శుక్రుడి పట్ల రాహువుకు గురు భావం ఉన్నందువల్ల ఈ రాశివారికి చతుర్థ రాహువు పూర్తి స్థాయిలో అదృష్టాలు కలిగిస్తాడు. సగటు వ్యక్తిని సైతం సంపన్నుడిని చేయడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. నిరుద్యో గులకు విదేశీ అవకాశాలు అందివస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి.
వృశ్చికం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఏ రంగంలో, ఏ స్థితిలో ఉన్నా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ధన ధాన్యాలకు లోటు ఉండని పరిస్థితి కలుగుతుంది. శీఘ్రగతిన పదోన్నతులు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబా నికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో రాహువు ప్రవేశించడం వల్ల ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరుగు తాయి. ధన నష్టానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబంలో సుఖశాంతులు తగ్గే అవకాశం ఉంది. మాట తొందరపాటు పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగు లకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం: ఈ రాశిలో రాహువు ప్రవేశం వల్ల విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది.
కుంభం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల వల్ల నష్టపోవడం, మోసపోవడం వంటివి జరుగుతాయి. రహస్య శత్రువులు తయారవుతారు. కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకోవడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
మీనం: ఈ రాశికి లాభస్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రాహువు వీరిని అనేక విధాలుగా ఉచ్ఛ స్థితికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా పడుతుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు కలుగుతాయి.












