Headlines

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఒకేరోజు రెండు శుభవార్తలు.. పండుగ చేస్కోండి.. ఇక నుంచి ఎంతైనా తీసుకోవచ్చు..


పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ భారీ శుభవార్త అందించింది. పీఎఫ్ ముందస్తు విత్ డ్రా పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగంలో ఉన్నప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు 75 శాతం మాత్రమే పాక్షికంగా ఉపసంహరించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని 90 శాతానికి పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగం చేస్తున్నప్పుడే తమ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 90 శాతం నిధులను అవసరమైన సమయంలో తీసుకునే అవకాశం లభించింది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురైన సమయంలో డబ్బులు తీసుకోవాలనుకునేవారికి ఇది పెద్ద ప్రయోజనం చేకూర్చనుంది. దీంతో పాటు గురువారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో మరో పెద్ద నిర్ణయం కూడా తీసుకుంది భవిష్య నిధి సంస్థ. అదేంటి అనేది చూద్దాం.

రెండు నెలల తర్వాత మొత్తం విత్ డ్రా

ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఉద్యోగం మానేసిన తర్వాత 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే మాత్రమే పీఎఫ్ ఫుల్ అండ్ ఫైనల్ విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు దీనిని మళ్లీ రెండు నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత మిగిలిన నిధులన్నీ ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఆర్ధిక ఇబ్బందుల సమయంలో ఉద్యోగులకు ఆర్ధిక రక్షణగా నిలిచేందుకు నిబంధనల్లో ఈ మార్పులు చేశారు. నవంబర్ 19వ తేదీన ఢిల్లీలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను ఆమోదించారు. అయితే ఉద్యోగ పెన్షన్ పథకంలో కనీస పెన్షన్ పరిమితిని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

కొత్త విధానం తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ

సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ కోసం పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఒకేసారి కాకుండా విడతలుగా ఉపసంహరించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఒక ఉద్యోగి ఖాతాలో రూ.30 లక్షలు ఉంటే.. వాటిని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి విడతలవారీగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రతీ నెలా తీసుకోవడం లేదా నిర్ణీత వ్యవధుల్లో ఉపసంహరించుకోడం లాంటి విధానాన్ని పాటించవచ్చు. దీని వల్ల డిపాజిట్ మొత్తం ఒకేసారి ఖాళీ అవ్వకపోడం వల్ల మిగిలిన నిధులపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఖాతాలో డబ్బులు మిగులుతాయి.ఉద్యోగి పదవీ విరమణ తర్వాత సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ ప్రకారం  ద్వారా నెలవారీ PF ఉపసంహరణలు ప్రారంభించిన కొంత కాలం తర్వాత ఖాతాదారుడు మరణిస్తే అటువంటి పరిస్థితిలో నామినీ లేదా వారిపై ఆధారపడినవారు ఖాతాలో మిగిలి ఉన్న నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *