Headlines

ఈ రెండు చోట్ల పుట్టుమచ్చలు ఉన్నాయా? మీకు రాజయోగం.. కోటీశ్వరులయ్యే అదృష్టం ఉందట!


Mole Astrology Telugu: సముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై ఉండే పుట్టుమచ్చలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇవి కేవలం చర్మంపై కనిపించే గుర్తులు మాత్రమే కాకుండా, ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, అదృష్టం, భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలని సంప్రదాయంగా భావిస్తారు. శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలను బట్టి వ్యక్తుల జీవితంలో సంపద, విజయం, గౌరవం, ప్రయాణ యోగాలు ఎలా ఉంటాయో అంచనా వేస్తుంటారు.

ముఖ్యంగా శరీరంలోని రెండు ప్రత్యేక ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం అత్యంత శుభప్రదమని సముద్రిక శాస్త్రంలో పేర్కొంటారు. పాదాలపై, కుడి అరచేతిపై పుట్టుమచ్చలు ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుందని, జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయని నమ్ముతారు. వీరు కష్టపడి పనిచేయడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు సంపద, సుఖసంతోషాలను పొందుతారని చెబుతారు. మరి ఆ రెండు ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

1. పాదం అరికాలిపై పుట్టుమచ్చ

సముద్రిక శాస్త్రం ప్రకారం పాదం అరికాలిపై పుట్టుమచ్చ ఉండటం అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇలాంటి పుట్టుమచ్చలు ఉన్నవారికి జీవితంలో అనేక ప్రాంతాలు సందర్శించే అవకాశం ఉంటుందని నమ్ముతారు. కొందరికి విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో ఉద్యోగాలు లేదా వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చని చెబుతారు. అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుని రాజభోగాలను అనుభవిస్తారని సంప్రదాయ విశ్వాసం. అయితే పాదంలోని ఏ భాగంలో పుట్టుమచ్చ ఉందనే దానిని బట్టి ఫలితాలు మారుతాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి



  • కాలి వేళ్లపై లేదా అరికాళ్ల పైభాగంలో: ఈ ప్రాంతాల్లో పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులని భావిస్తారు. వీరికి ఆర్థికంగా మంచి అవకాశాలు లభించడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని నమ్ముతారు.
  • అరికాళ్ల మధ్యలో: ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారు తెలివైనవారు, నిజాయితీపరులు, నలుగురితో కలిసిపోయే స్వభావం కలిగినవారుగా చెబుతారు. అయితే లక్ష్యాలను చేరుకోవడానికి ఇతరుల సహకారం అవసరం కావచ్చు.
  • మడమపై లేదా అరికాళ్ల కింది భాగంలో: ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారికి ప్రయాణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని, జీవితంలో దూర ప్రాంతాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు.
  • అరికాళ్ల పక్కన: ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరిస్తారని, కళలపై ఆసక్తి కలిగి ఉంటారని చెబుతారు. అయితే కొన్నిసార్లు తొందరగా కోపం తెచ్చుకునే స్వభావం ఉంటుందని కూడా విశ్వసిస్తారు.

2. కుడి అరచేతిపై పుట్టుమచ్చ

సముద్రిక శాస్త్రం, హస్తసాముద్రికం ప్రకారం కుడి అరచేతిపై పుట్టుమచ్చ ఉండటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు స్వయంకృషిని నమ్ముతారని, పట్టుదలతో పనిచేసి జీవితంలో విజయాలు సాధిస్తారని చెబుతారు. వీరికి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు లభించడంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతారు. అరచేతిలోని వివిధ పర్వతాలపై ఉండే పుట్టుమచ్చలకు కూడా ప్రత్యేక అర్థాలు ఉన్నాయి.

  • బృహస్పతి పర్వతంపై: చూపుడు వేలు కింద ఉండే ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారని, సుఖసంతోషాలు పొందుతారని నమ్ముతారు.
  • శని పర్వతంపై: మధ్యవేలు కింద ఉండే ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే జీవితంలో సంపద, సౌకర్యాలు, స్థిరత్వం లభిస్తాయని భావిస్తారు.
  • సూర్య పర్వతంపై: ఉంగరపు వేలు కింద పుట్టుమచ్చ ఉంటే కీర్తి, కుటుంబ జీవితం, ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంప్రదాయ నమ్మకం.
  • అరచేతి మధ్యలో: పిడికిలి బిగించినప్పుడు కనిపించే అరచేతి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉండటం అత్యంత అదృష్టంగా భావిస్తారు. ఇది సంపద, విజయం, ఆర్థిక అభివృద్ధికి సంకేతమని చెబుతారు.

(Disclaimer: పుట్టుమచ్చల ఆధారంగా వ్యక్తి అదృష్టం, భవిష్యత్తును అంచనా వేయడం సముద్రిక శాస్త్రం, హస్తసాముద్రికాలకు సంబంధించిన సంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *