Headlines

వామ్మో.. చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ముఖ్యంగా ఆదివారాలు, గురువారాలు, అమావాస్య రోజులు వచ్చాయంటే చాలు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన రహదారులు, కూడళ్లు, పొలాల గట్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లు, ఎండుమిర్చి వంటి వస్తువులను ఉంచి పూజలు చేస్తున్న ఘటనలు స్థానికంగా భయాందోళన కలిగిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో రోడ్ల కూడళ్ల వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు నాటుకోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయి. ఉదయాన్నే ఈ దృశ్యాలను చూసిన స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదే తరహా ఘటనలు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లోనూ వరుసగా వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్దపల్లి మండలంలో చెట్టుకు బొమ్మలను కట్టి పూజలు చేయడం, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపించడంతో రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అమావాస్య రాత్రులు, ప్రత్యేక వారాల్లో ఈ పూజలు జరుగుతున్నాయనే ప్రచారం గ్రామాల్లో భయాన్ని కలిగిస్తోంది. తెల్లవారుజామున రోడ్లపై పూజా సామగ్రిని చూసి జనం ఆందోళన చెందుతున్నారు. మూఢనమ్మకాల పేరుతో ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న ఆగంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీతాఫలం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ విషయాలు అస్సలు మిస్ అవ్వకండి!

జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!

స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచులు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌..

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా.. అల్వాల్‌ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

అయ్యప్పభక్తులకు తీపి కబురు.. మీ ఇంటికే నేరుగా ప్రసాదం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *