Headlines

Gold Price Today: కొనసాగుతున్న పసిడి పతనం..ఇవాళ తులం గోల్డ్ ధర ఇదే!


అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల గరిష్ఠ స్థాయిల నుండి దిగివస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. మరోవైపు ముడి చమురు ధర ఎక్కువగా ఉన్నా పెట్టుబడిదారులు బంగారం వైపు వెళ్లడం లేదు. ఎందుకంటే ధరలు రోజు రోజుకు భారీగా పడిపోతున్నాయి. దీని వల్ల పెట్టుబడిదారులు కూడా ఆందోళనలో ఉన్నారు. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా ధరలు భాగానే తగ్గాయని చెప్పవచ్చు. నవంబరు 17 మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.760 తగ్గి, రూ.1,36,040 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.700 తగ్గి, రూ.1,24,700 పలుకుతోంది. వెండి ధర రూ.1,90,000 తో స్థిరంగా కొనసాగుతోంది. నవంబరు 17 మంగళవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,24,850 పలుకుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,36,040, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,700 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.1,90,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకొని వెళ్లాలి. బంగారంపై పెట్టుబడి పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. ఇక్కడ మేం అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో ముసుగు దొంగల సంచారం..

బ్యాటింగ్ వైఫల్యాలపై గంభీర్, రవిశాస్త్రి సీరియస్!

అయ్యో.. పచ్చబొట్టు ఎంత పనిచేసింది!

Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్

Rohith Naidu: హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై.. రోహిత్ నాయుడు నుంచి కీలక నోట్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *