సౌత్ సీనియర్ హీరోయిన్ రోజా సెల్వమణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సీనియర్ హీరోయిన్స్ మీనా, సంగీతతోపాటు కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా, ప్రముఖ దర్శకుడు శంకర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించిన తారలు ఒకే వేదికపై కనిపించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కలిసి కనిపించడం విశేషం.