Headlines

Gold Silver Price: భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్!


Gold Silver Price: బంగారం, వెండి ధరలు కుప్పకూలిపోతున్నాయి. రికార్డు స్థాయిలో, ఊహించిన విధంగా పతనం అవుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో ధరలు దిగి రావడం మహిళలకు పండగలాంటి వార్తేనని చెప్పవచ్చు. అయితే గతంలో రికార్డును చెరిపేసేలా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు తాజాగా ధరలు భారీగా దిగి రావడం సామాన్యులకు భారీ ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై దాదాపు 2 వేల రూపాయల వరకు దిగి రావడం గమనార్హం. ధరలు తగ్గిన తర్వాత తాజాగా నవంబర్‌ 14వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,890 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,890 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,26,040 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,890 ఉంది.
  5. ఇక వెండి విషయానికొస్తే..ఇది కూడా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతోంది. కిలో వెండిపై ఏకంగా 5 వేల రూపాయలకుపైగా దిగి వచ్చింది. ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర రూ.1,94,900 వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు. ఇది ఒక్క కారణంతో జరుగుతున్న పతనం కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు కలిసి బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

BSNL: ఇప్పుడు 365 రోజులు కాదు.. 395రోజుల వ్యాలిడిటీ.. రూ.లక్ష ఇన్స్‌రెన్స్‌..!

Jio: జియోలో అదిరిపోయే ఆఫర్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే రెండోసారి ఫ్రీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *