Headlines

Ration Card Update: 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోకుంటే రేషన్‌ నిలిపివేత…? కేంద్రం కీలక నిర్ణయం!


Ration Card Update: దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రేషన్ వ్యవస్థలో ఉన్న నకిలీ, డూప్లికేట్, క్రియాశీలంగా లేని లేదా అనుమానాస్పద లబ్ధిదారులను గుర్తించి వ్యవస్థను మరింత ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 15.8 మిలియన్లు అంటే సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ ఎంటైటిల్‌మెంట్లను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నివేదికలు అందుతున్నాయి. అయితే రేషన్ కార్డులను వెంటనే శాశ్వతంగా డేటాబేస్ నుంచి తొలగించరు. ముందుగా వాటిని తాత్కాలికంగా డిసేబుల్ చేస్తారు. అర్హత ఉన్న నిజమైన లబ్ధిదారులు తమ వివరాలను నిర్ధారించుకునేందుకు మూడు నెలల సమయం ఉంటుంది. ఈ సమయంలో e-KYC పూర్తి చేసి, అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేస్తే కార్డును మళ్లీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Jio: ఏపీలో రిలయన్స్ జియో రికార్డుల సునామీ.. ఒక్క నెలలోనే ఎన్ని లక్షల మంది చేరారో తెలుసా?

ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది?

కొత్త నిబంధనల్లో ఇలాంటి కార్డులను silent ration cardsగా పరిగణిస్తున్నారు. అంటే గత ఆరు నెలల్లో ఆ కార్డుపై ఆహార ధాన్యాల కేటాయింపును వినియోగించని కార్డులు. కేంద్రం సవరించిన Targeted Public Distribution System (Control) Order ప్రకారం.. ఆరు నెలలుగా రేషన్ వినియోగించని కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నిలిపివేయాలి. ఆ తర్వాత మూడు నెలల్లో e-KYC, ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా లబ్ధిదారుడి అర్హతను మళ్లీ పరిశీలించాలి. అంటే ఆరు నెలలు రేషన్ తీసుకోలేదు కాబట్టి కార్డు శాశ్వతంగా రద్దు అని అర్థం కాదు. ముందుగా తాత్కాలికంగా నిలిపివేసి, అర్హతను నిరూపించుకునే అవకాశం ఇవ్వడం ఈ ప్రక్రియలో కీలక అంశం.

ఇవి కూడా చదవండి



అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సెప్టెంబర్ 1, 2026న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార శాఖ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కొత్త SOPలు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. దీంతో రేషన్ డేటాబేస్‌ను మరింత కచ్చితంగా నిర్వహించడంతో పాటు, అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ ఆహార ధాన్యాల ప్రయోజనం అందేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Rules Change: అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే 10 కీలక మార్పులు ఇవే!

ఇది కూడా చదవండి: మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా? ఈ పరిస్థితికి దారితీసే నియమాలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *