Headlines

Asian Games Cricket 2026: ఒక్క మ్యాచ్ ఆడకుండానే టీమిండియాకు గోల్డ్ మెడల్..?


ఆసియా క్రీడలు (Asian Games) 2026లో పురుషుల క్రికెట్ నాకౌట్ దశకు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన పరిస్థితుల్లో మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ ఉన్న జట్లకు తదుపరి రౌండ్‌లో అవకాశం లభించింది. భారత జట్టు కూడా ఇదే నిబంధనతో సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఇప్పుడు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లపై వర్షం ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్ సెమీఫైనల్‌లో శ్రీలంకతో తలపడాల్సి ఉంది. అక్టోబర్ 1న జరిగే ఈ మ్యాచ్ రద్దైతే మెరుగైన ర్యాంకింగ్ కారణంగా భారత్ ఫైనల్‌కు చేరుతుంది. భారత్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండటమే దీనికి కారణం. దీంతో మ్యాచ్ ఫలితం కంటే ర్యాంకింగ్ నిబంధన కీలకంగా మారనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *