Headlines

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..


బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అలాగే, కర్ణాటక-తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాం పరిధిలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీ వెదర్ రిపోర్ట్..

మంగళవారం (29-09-26) మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణ వాతావరణ సూచన..

ఇదిలాఉంటే.. తెలంగాణ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

స్వల్పంగా తగ్గిన గోదావరి వరద..

భద్రాచలంలో నీటిమట్టం 36.4 అడుగులు, కూనవరంలో 17.8 మీటర్లు, పోలవరంలో 11.7 మీటర్లుగా ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు 9.71 లక్షల క్యూసెక్కుల నీరు నిలకడగా లోపలికి, బయటకు ప్రవహిస్తోందని APSDMA తెలియజేసింది. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కలవర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకర ప్రయాణాలను చెయ్యొద్దని హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *