Headlines

Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..!


Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో ప్రారంభమైన తగ్గుదల తర్వాత, సెప్టెంబర్ ప్రారంభంలో వెండి, బంగారం ధరలు కొంత మెరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు, నెల చివరిలో ఈ రెండు లోహాల ధరలు మళ్లీ తీవ్రంగా పడిపోయాయి.

నిన్న ఒక్క రోజే తులం బంగారంపై ఏకంగా 2,500కుపైగా తగ్గుముఖం పట్టింది. ఈ వారం రోజుల్లో చూస్తే.. తులం బంగారంపై ఏకంగా 4500 రూపాయల వరకు పడిపోయింది. తాజాగా సెప్టెంబర్ 29న తులం బంగారం ధర రూ.1,50,160 వద్ద కొనసాగుతోంది. ఇది ఈ నెలలో అత్యల్ప ధర. ఈ మార్కెట్ అస్థిరత, పండుగ సీజన్ కోసం ఇప్పటికే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చిన చిన్న వ్యాపారులను ప్రభావితం చేసింది. ఇక వెండి కూడా మరింత దిగజారుతోంది. కిలోవెండిపై నిన్న ఒక్క రోజు 5 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర రూ.2,39,900 వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో ధరలు:

హైదరాబాద్‌ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీ- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,310 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,790 వద్ద ట్రేడవుతోంది.

ముంబై- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.

చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *