Headlines

Sudha: ఇండస్ట్రీలో అతడంటే చాలా క్రష్.. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా.. టాలీవుడ్ నటి సుధా..


సీనియర్ నటి సుధా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) గారిపై తనకున్న అభిమానం, ఆదర్శ నటి సావిత్రి గారు, సినీ పరిశ్రమలో తన అనుభవాలు, కుటుంబ జ్ఞాపకాలు, నేటి తరం నటీనటుల గురించి మాట్లాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిపై తనకు పెద్ద క్రష్ ఉందని సుధా వెల్లడించారు. “నేను మిమ్మల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలి” అని ఆయనతో సరదాగా అన్నప్పుడు, ఆయన నవ్వుకున్నారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు తాను ఎస్పీబీ పాటలను తరచుగా వింటూ ఉంటానని, తన “బాలు గారు” అని ప్రేమగా పిలుస్తానని అన్నారు. అయితే, తన ఆదర్శ నటి మాత్రం సావిత్రి గారే అని, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సుధా స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ, తల్లితోనే తాను ఎక్కువ క్లోజ్ అని, ఆమె తన మంచి స్నేహితురాలని చెప్పారు. అప్పట్లో సినిమాలు గురించి అవగాహన తక్కువగా ఉండేదని, ఒక వయసు వచ్చిన తర్వాతే సినీ ప్రపంచం గురించి తెలిసిందని తెలిపారు. నటన నేర్చుకోవడానికి అప్పట్లో నటన తరగతులు లేవని, సెట్‌లోని సీనియర్ నటులు “ఈ సీన్ ఇలా చేయండమ్మ,” “ఈ డైలాగ్‌కు ఈ రియాక్షన్ ఇవ్వండి” అని నేర్పించేవారని వివరించారు. ఇది ఆరోగ్యకరమైన పోటీతో కూడిన అభ్యాస ప్రక్రియ అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

తన ఆరేళ్ల భరతనాట్య శిక్షణ, అరంగేట్రానికి ముందు జరిగిన ప్రమాదం గురించి సుధా భావోద్వేగంగా మాట్లాడారు. ఆరు నెలలు మంచానికే పరిమితమై, కాళ్లు, చేతులు విరిగిపోయిన తర్వాత, జీవితం అంతేనేమో అనుకున్నానని, కానీ కోలుకోవాలని రాసి పెట్టిందని చెప్పారు. బెడ్ రిడన్‌గా ఉన్నప్పుడు ఒకరు పైకి లేపాలని, అంత సివియర్ అయిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో డాన్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించానని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

నటి సుధ, ఎస్పీ బాలు..

Sudha, Sp Balu

Sudha, Sp Balu

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *