Headlines

RBI Rules: లోన్ కట్టలేదని కాల్స్ చేసి వేధిస్తున్నారా..? ఈ రూల్స్ తెలిస్తే మీ జోలికిరారు.. మీరు సేఫ్ అయినట్లే..


లోన్ తీసుకుని ఈఎంఐ చెల్లించడంలో జాప్యం చేస్తే రికవరీ ఏజెంట్లు మీకు కాల్స్ చేస్తూ ఉంటారు. కాల్స్ చేసి అడగడం అనేది వారి హక్కు. అయితే మిమ్మల్ని వేధించడం, బెదిరింపులకు పాల్పడటం, అవమానించడం, దుర్బాషలాడటం, బూతులు తిట్టడం అనేది నిబంధనలకు విరుద్దం. రుణగ్రహీతకు కూడా ఆర్బీఐ కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రుణం చెల్లించలేదని ఎలా పడితే అలా చేయడం కుదరదు. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఆర్బీఐ నిర్దేశించిన కొన్ని లోన్ రికవరీ ప్రొసీజర్స్‌ను పాటించాల్సి ఉంటుంది. కాల్స్ ఏ టైమ్‌లో చేయాలి..? ఇంటిని సందర్శించాలంటే ఎలాంటి ప్రక్రియ ఫాలో అవ్వాలి..? లోన్ ఎలా వసూలు చేయాలి? అనే దానిపై ఆర్బీఐ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. లోన్ రివవరీ ఏజెంట్ల ఆగడాలు, బెదిరింపులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. రుణ గ్రహీతలకు రక్షణగా, ఆర్ధిక సంస్థలు పారదర్శకంగా లోన్ వసూలు చేసేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయి.

ఈ సమయంలో మాత్రమే కాల్స్ చేయాలి..

రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతకు కాల్స్ చేయాలని ఆర్బీఐ నిబంధనల్లో పొందుపర్చింది. ఈ టైమ్‌ దాటిన తర్వాత కాల్స్ చేయడానికి వీల్లేదు. ఇక ఇంటిని లేదా కార్యాలయాన్ని సందర్శించాలనుకుంటే ముందుగానే సమాచారం అందించాలి. ఇక పబ్లిక్‌గా అవమానించడం, స్నేహితులకు కాల్స్ చేసి పరువుకు భంగం కలిగించడం, వేధింపులు, బెదిరింపులకు పాల్పడటం, పదే పదే కాల్స్ చేయడం అనేది నిబంధనలకు విరుద్దం. భయపెట్టడం, గొడవకు దిగడం, బలవంతంగా చెల్లింపులు చేయించడానికి ప్రయత్నించడం అనేది చేయకూడదు.

లోన్ రికవరీ ఏజెంట్‌పై ఫిర్యాదు చేయడం ఎలా..?

ఒకవేళ లోన్ రివరీ ఏజెంట్ మిమ్మల్ని బెదిరించినా, వేధింపులకు పాల్పడ్డా, ఆర్బీఐ నిబంధనలు పాటించకపోయినా రుణగ్రహీత ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా బ్యాంక్ లేదా ఎన్‌ఎఫ్‌బీపీ సంస్థకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఈమెయిల్ ద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చు. రికవరీ ఏజెంట్ పేరు, ఫోన్ నెంబర్, ఘటన జరిగిన తేదీ, సమయం, వేధింపుల వివరాలు, సాక్ష్యానికి సంబంధించిన వివరాలు అందించాలి. ఇక ఆర్దిక సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే నోడల్ ఆఫీసర్ లేదా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఆశ్రయించాలి. అప్పటికీ మీకు న్యాయం జరక్కపోతే ఆర్బీఐ ఓబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. rpc@rbi.org.in ద్వారా ఆర్బీఐ కంప్లైంట్ చేయవచ్చు. ఇక శారీరక వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక న్యాయవాదిని సంప్రదించి చట్టపరంగా కోర్టులో కూడా పిటిషన్ వేయవచ్చు.  ఇలా అనేక మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *