Headlines

ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ.. కింగ్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన శుభ్మన్ గిల్..!


Shubman Gill: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు (Team India) ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు స్థాయిలో 55వ వన్డే శతకం సాధించాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 108 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 110 పరుగులు చేసిన గిల్.. మ్యాచ్‌ను చివరి వరకు ఆడాలని భావించానని చెప్పాడు. తాను ఔటైన సమయంలో మ్యాచ్‌ను ముగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో కోహ్లీ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న విధానంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటను మరింత ఆస్వాదిస్తూ స్వేచ్ఛగా ఆడుతున్నాడని చెప్పాడు. బౌండరీలు సాధించే సామర్థ్యం అతడికి ఎప్పుడూ ఉందని, ఇప్పుడు అదే మరింత స్పష్టంగా కనిపిస్తోందని వివరించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *