Headlines

నాగుపాము పడగవిప్పి నిటారుగా అందుకే నిలుచుంటుందా..? అరెరే ఇన్ని రోజులు ఈ విషయం తెలీదే..!


విశాఖలో ఓ నాగుపాము హల్చల్ చేసింది.. పడగవిప్పి నిటారుగా నిల్చుంది. ఎంతసేపైనా అక్కడ నుంచి కదలకుండా ఉండిపోయింది. దాదాపుగా గంటన్నర పాటు.. కనిపించిన ఆ దృశ్యం స్థానికులను భయాందోళన గురిచేసింది. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో.. ఆ భారీ నాగుపామును చాకచక్యంగా రెస్క్యూ చేశాడు. ఇంతకీ ఆ నాగుపాము ఎందుకు అలా పడగవిప్పి భయపెట్టింది..? పోతిన మల్లయ్యపాలెం స్టేడియం సమీపంలో ఓ ఇల్లు.. ఇంటి ఆవరణలో ఓ గట్టు.. చుట్టూ కాకులు అరుస్తున్నాయి.. అదేపనిగా పక్షులు, కాకులు అరవడాన్ని గమనించిన ఆ ఇంటి కుటుంబం బయటకు వచ్చి చూసింది. చెట్లపై కాకులు తిరుగుతున్నాయి.. అదేపనిగా అరుస్తూ ఉన్నాయి. దీంతో ఏమై ఉంటుందని అంతా చూశారు. ఇదే సమయంలో గట్టుపై ఓ నాగుపాము కనిపించడంతో హతాసులయ్యారు. పడగ విప్పిన నాగుపాము.. నిటారుగా నిలుచుని ఉంది. దాదాపుగా మూడు అడుగుల ఎత్తు వరకు నిలుచుని అలాగే ఉండిపోయింది. దాన్ని చూసిన కాకులు పక్షులు అరుస్తూ కనిపించాయి.

ఎంతసేపటికి ఆ పాము అక్కడ నుంచి కదలకుండా ఉండిపోవడంతో మా కుటుంబం భయాందోళన గురైంది. అక్కడ మంచి ఆ పాము ఎప్పుడు వెళ్తుందోనని వేచి చూసింది ఆ కుటుంబం. గంటపాటు అలాగే ఉండిపోయింది. ఎంతకీ అక్కడ నుంచి ఆ నాగుపాము వెళ్లకపోవడంతోపాటు పడగ విప్పి అలాగే నిటారుగా నిలుచుని ఉండడంతో.. భయాందోళన గురైన ఆ కుటుంబం స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన స్నేహ నాగరాజు.. వెళ్లేసరికి కూడా ఆ పాము అక్కడే అలాగే పడక విప్పి ఉంది. దీంతో.. చాకచక్యంలో ఆ నాగుపామును రెస్క్యూ చేశాడు నాగరాజు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాగుపామును జనావాసాలు లేనిచోట అడవుల్లో వదిలేశాడు నాగరాజు..

వీడియో చూడండి..

నాగుపాము ఎందుకు నిటారుగా ఉండిపోతుంది..?

నాగుపాము పడగ విప్పిందంటే తాను దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతం. ఎవరైనా శత్రువుల నుంచి తనకు ఆపద ఎదురైనట్టు నాగుపాము భావిస్తే.. పడగబెట్టి నిల్చుకుంటుంది. భుసలు కొట్టి భయపడుతుంది. శత్రువు దూరంగా జరిగితే అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతుంది నాగుపాము.. ఆత్మరక్షణ, ప్రాణభయంతోనే నాగుపాములో ఆ విధంగా బిహేవియర్ కనిపిస్తుందని అంటున్నారు జువాలజీ నిపుణులు.

ఇక.. సహజంగా పాములను చూసి కాకులు అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే కాపులు పెట్టిన గుడ్లను కొన్ని సందర్భాల్లో పాములు తమకు ఆహారంగా చేసుకుంటారు. అందుకోసమే ఎక్కడైనా పాములు కనిపిస్తే కాకులు అదేపనిగా అరుస్తూ కనిపిస్తాయి. కాకులకు, పాములకు మధ్య సహజమైన శత్రుత్వం ఉంటుంది. ఎక్కడైనా నాగుపాము కనిపిస్తే చాలు, కాకులు ఒక గ్రూప్‌గా చేరి దాని చుట్టూ తిరుగుతూ, గట్టిగా అరుస్తూ ముక్కుతో పొడవడానికి ప్రయత్నిస్తాయి. దీనిని సైన్స్‌లో ‘మాబింగ్ బిహేవియర్’ అంటారు. అయితే. అయితే… ప్రతిగా నాగుపాము.. పడగ విప్పి, బుసలు కొట్టడం ద్వారా తాను చాలా ప్రమాదకరమైన దాడికి సిద్ధంగా ఉన్నానని.. తన జోలికి రావద్దని కాకులను నాగుపాము హెచ్చరించేలా వ్యవహరిస్తుంది. తాజాగా గంటన్నర పాటు పడగ వ్యక్తి నిలుచున్న నాగుపాము విషయంలో అదే జరిగే ఉంటుందని అంటున్నారు జువాలజీ ప్రొఫెసర్లు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *