
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అనిరుధ్ ఎలాంటి మ్యాజిక్ చేశారో, ఇప్పుడు సాయి కూడా తన మ్యూజిక్ తో అదే రేంజ్ దూకుడు చూపిస్తున్నారు. యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ ఇండస్ట్రీలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు. వరుస విజయాలు అందుకుంటున్నారు. సూర్య కరుప్పు సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన సాయి అభ్యంకర్ వెంటనే సూర్య నెక్స్ట్ సినిమాతో పాటు ధనుష్ ప్రాజెక్టు కూడా పట్టేశారు. అట్లీ, అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ రాకాకి కూడా ఈయనే మ్యూజిక్ ఇస్తున్నారు. ఇలా కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్నిచోట్లా తన మార్క్ చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ తోనూ సత్తా చూపిస్తున్నారు. మరోవైపు అనిరుధ్ రవిచందర్ జోరు కూడా తక్కువేం లేదు. క్రేజీ ఆఫర్స్ ఉండటంతో అనిరుధ్ హవా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికిప్పుడు చూసుకుంటే అనిరుధ్ కు సాయి అభ్యంకర్ సరైన పోటీ అని చెప్పలేం కానీ ఆయన స్పీడ్ చూస్తుంటే మాత్రం అసలు తక్కువ అంచనా వేయలేం. త్వరలోనే ఈ ఇద్దరి మధ్య బిగ్గెస్ట్ మ్యూజికల్ వార్ చూడడం అయితే పక్కా.