ఇక బ్యాటింగ్ విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. క్రీజులో కుదురుకున్న తరువాత పరిస్థితి అనుమతిస్తే అదనపు పరుగుల కోసం రిస్క్ తీసుకోవాలని భావిస్తున్నాడు. ప్రత్యర్థులు 340, 350 పరుగుల లక్ష్యాల వైపు వెళ్లే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కూడా 350, 360 పరుగులు సాధించే సామర్థ్యంతో ఆడాలని తన ఆలోచనగా వివరించాడు.