వేపాకులను మెత్తగా నూరి, అందులో పసుపు కలిపి పగుళ్లపై రాస్తే రెండు రోజుల్లోనే నొప్పి తగ్గి పాదాలు మృదువుగా మారతాయి. వేపలోని యాంటీ ఫంగల్ లక్షణాలు, పసుపులోని యాంటీ బయోటిక్ గుణాలు బ్యాక్టీరియాను సమర్థవంతంగా నివారిస్తాయి. అలాగే పసుపు, తులసి, తేనె, అలోవెరా కలిపిన మిశ్రమాన్ని పగుళ్లపై అప్లై చేసినా పాదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.